Advertisement
Google Ads BL

అవకాశాల కోసం శ్రీరెడ్డి బెదిరిస్తోందా?!


తెలుగులో పలువురు సినీ ప్రముఖుల మీద లైంగిక ఆరోపణలు చేయడమే గాక ఏకంగా ఫిల్మ్‌చాంబర్‌ ఎదుట అర్ధనగ్నంగా నిరసన చేసిన నటి శ్రీరెడ్డి. మాలో సభ్యత్వం కోసం ఆమె ఎందరినో వివాదంలోకి ఈడ్చి భయపెట్టింది. అందుకే ఇటీవల విశాల్‌ కూడా చెన్నైలో జరిగిన వేడుకలో శ్రీరెడ్డితో జాగ్రత్తగా ఉండాలని, ఎందుకంటే ఆమె మెడలో రహస్యంగా కెమెరాలు ధరించినా ధరిస్తుందని సెటైర్లు వేశాడు. దానిపై సభలోని వారే కాదు.. విశాల్‌ పక్కన ఉన్న కీర్తిసురేష్‌ సైతం నవ్వులు చిందించింది. కానీ ఆ వెంటనే శ్రీరెడ్డి.. కీర్తిసురేష్‌ నవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమెని నానా విధాలుగా తిట్టిపోసింది. 

Advertisement
CJ Advs

మరోవైపు ఈమె చెన్నై వెళ్లి కోలీవుడ్‌లో అవకాశాలు సాధించి బిజీ కావాలనే ప్రయత్నంలో ఉంది. ఈమె తెలుగు సినీ ప్రముఖులతో పాటు మురుగదాస్‌, లారెన్స్‌ వంటి వారిని కూడా లైంగిక వేధింపుల విషయంలో బజారుకీడ్చింది. నిన్నటివరకు ఆమె లారెన్స్‌వి తీసే చిత్రాలే కాదు.. ఆయన నిజజీవితంలో కూడా దెయ్యమే. మంచి మనిషి ముసుగువేసుకున్న నీచుడు లారెన్స్‌ అని నానా విధాలుగా తిట్టిపోసింది. ఇక విషయానికి వస్తే తాజాగా ఆమెకి లారెన్స్‌ తన చిత్రంలో అవకాశం ఇచ్చాడట. 

ఈ విషయం గురించి శ్రీరెడ్డి స్పందిస్తూ..తన ట్విట్టర్‌ ఖాతాలో.. నా స్నేహితులందరికీ శుభవార్త. నేను లారెన్స్‌ని ఆయన నివాసంలో కలుసుకున్నాను. ఆయన నాకు మంచి గౌరవం ఇచ్చారు. అక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. వారంతా లారెన్స్‌తో సంతోషంగా ఉన్నారు. వారు నాకోసం ప్రార్ధించారు కూడా..! నేను ఆడిషన్స్‌లో కూడా పాల్గొన్నాను. తన తదుపరి చిత్రంలో నాకు అవకాశం ఇస్తానని లారెన్స్‌ హామీ ఇచ్చారు. మంచి పాత్రను ఆఫర్‌ చేస్తానని చెప్పారు. అడ్వాన్స్‌ కూడా ఇచ్చేశారు. దానిని నేను తిత్లీ తుపాన్‌ కారణంగా విపరీతంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లా ప్రజల కోసం విరాళంగా ఇస్తున్నాను అని తెలిపింది. 

మొత్తానికి ఆమె తన అడ్వాన్స్‌ని తిత్లీ తుపాన్‌ బాధితులకు విరాళం ఇవ్వడం మంచి పనే అయినా నిన్నటిదాకా దెయ్యం, నీచుడు అయిన లారెన్స్‌.. అంతలోనే దేవుడు ఎలా అయ్యాడు? ఆయన పిలిచిన వెంటనే శ్రీరెడ్డి ఆయన ఇంటికి వెళ్లడం ఏమిటి? ఆమె బెదిరించి అవకాశాలు సాధించాలని చూస్తోందా? అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. 

Raghava Lawrence offers a chance to SriReddy:

Lawrence Ropes In Sri Reddy For His Next
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs