Advertisement
Google Ads BL

బలవంతంగా పోర్న్ క్లిప్స్ చూపించాడు: నమిత


లైంగికవేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జాబితాలోకి మరో ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు కూడా చేరాడు. ఇప్పటికే ఈ జాబితాలో నానాపాటేకర్‌, అలోక్‌నాథ్‌, వికాస్‌బహ్ల, సాజిద్‌ఖాన్‌, సుభాష్‌ఘయ్‌, భూషణ్‌కుమార్‌, ముఖేష్‌ఛబ్రాల పేర్లు చేరాయి. ఇక తాజాగా యాక్షన్‌చిత్రాల దర్శకుడు, నటుడు విక్కీ కౌశల్‌ తండ్రి శామ్‌ కౌశల్‌ కూడా చేరాడు. శామ్‌కౌశల్‌ వద్ద గతంలో డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌గా పనిచేసిన నమీత ప్రకాష్‌ ఈ సంచలన లైంగిక ఆరోపణలు చేయడం విశేషం. 

Advertisement
CJ Advs

ఔట్‌డోర్‌ షూటింగ్‌లకు వెళ్లినప్పుడు శామ్‌ కౌశల్‌ తనని లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించింది. 2006లో ఓ చిత్రం ఔట్‌డోర్‌ షూటింగ్‌ సందర్భంగా తన గదిలోకి తీసుకెళ్లి ఓడ్కా తాగమని బలవంతం చేశాడని, కొన్ని పోర్న్‌ ఫిల్మ్‌ క్లిప్‌లు చూపించాడని ఆమె సంచలన ట్వీట్‌ చేసింది. ‘మనోరమ సిక్స్‌ఫీట్‌ అండర్‌, అబ్‌ తక్‌ చప్పన్‌, హనీమూన్‌ ట్రావెల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ తదితర చిత్రాలకు నమీత ప్రకాష్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసింది. 

కాగా నమిత ఆరోపణలపై శామ్‌ కౌశల్‌ ఇప్పటిదాకా స్పందించలేదు. మరి త్వరలో ఆయనేమైనా స్పందిస్తాడేమో చూడాలి. సినీ ఫీల్డ్‌లో కేవలం నటీమణులు, సింగర్స్‌ మాత్రమే కాదు.. ఏ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే వారైనా సరే వారు మహిళలు అయితే లైంగిక వేధింపులు తప్పవని ఈ జాబితా చూస్తే అర్ధమవుతోంది. 

Vicky Kaushal’s father showed me porn: Nameeta Prakash:

Namitha prakash allegations on sham kaushal
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs