బాలకృష్ణ హీరోగా.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. ‘సింహ, లెజెండ్’ అనే రెండు సూపర్ డూపర్ హిట్స్ కొట్టాడు. అయితే ఆ సినిమాల్లో బోయపాటి శ్రీను లక్ష్మి నరసింహ స్వామి వారి సెంటిమెంట్ ని పెట్టేవాడు. సింహాచలం లక్ష్మి నరసింహ స్వామికి బోయపాటికి అవినాభావ సంబంధం ఉందంటారు చాలామంది. ఇకపోతే బోయపాటి తన ప్రతి సినిమాలో టెంపుల్ బ్యాగ్డ్రాప్ లో ఏదో ఒక యాక్షన్ సీన్ పెట్టడం అనేది పరిపాటి.
అందుకే రామ్ చరణ్‌తో చేస్తున్న RC12 చిత్రంలో కూడా అలాంటి టెంపుల్ లక్ష్మీనరసింహస్వామి బ్యాగ్డ్రాప్ లో ఒక యాక్షన్ సన్నివేశం ఉండేలా ప్లాన్ చేసాడట. ఇప్పటికే యాక్షన్ ఎంటెర్టైనెర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతుంది. RC12 లో ఇప్పుడు టెంపుల్ బ్యాగ్డ్రాప్ యాక్షన్ ఎపిసోడ్ అంటే బోయపాటి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి సినిమా సూపర్ హిట్ అంటూ మెగా ఫ్యాన్స్ అప్పుడే కామెంట్స్ పెట్టేస్తున్నారు. ఇప్పటికే అరుదైన లొకేషన్స్ లో RC12 యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరించిన బోయపాటి ఇప్పుడు సింహాచల వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మరో పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ ని తెరకెక్కిస్తున్నాడట.
రామ్ చరణ్ - కైరా అద్వానీ జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం విశాఖలోని సింహాచలంలో గల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో షూటింగ్ జరుగుతుంది. అక్కడ జరిగే చిత్రీకరణలో రామ్‌చరణ్ దర్శనం కోసం వెళుతున్న సన్నివేశాలను.. మాడవీధుల్లో పల్లకీసేవ సన్నివేశాలను.. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచిపెడుతున్న సన్నివేశాలను బోయపాటి చిత్రీకరించారు. మరి ఈ టెంపుల్ సెంటిమెంట్ రామ్ చరణ్ కి వర్కౌట్ అవుతుందా లేదా అనేది మాత్రం సస్పెన్స్. ఇక ఈ టెంపుల్ సన్నివేశాల షూటింగ్ లో రామ్ చరణ్ తో పాటు స్నేహ, ఆర్యన్ రాజేశ్, ప్రశాంత్ తదితరులు షూటింగులో పాల్గొన్నారు.