Advertisement
Google Ads BL

నేను రెడీ.. నెటిజన్‌కి షాకిచ్చిన చిన్మయ్!


చిన్మయి శ్రీపాద.. ఈమె పేరు గత కొంతకాలంగా హోరెత్తిపోతోంది. ఈమె కేవలం తనపై జరిగిన లైంగిక వేధింపులను మాత్రమే కాదు. తన స్నేహితురాళ్లు, ఇతరులు, తోటి సింగర్స్‌, నటీమణులు.. ఇలా ఎవరెవరు వేధింపులకు గురవుతున్నారో అందరి తరపున తను ప్రశ్నలను సంధిస్తూ, లైంగికదాడులు చేస్తున్న మృగాళ్లు ఎంత పెద్ద వారైనా ఎంతో ధైర్యంగా బయటపెడుతోంది. ఈ విషయంలో ఆమెకు ప్రాణాపాయం, కెరీర్‌ నాశనం అయ్యే పరిస్థితులు ఉన్నా కూడా ఈమె వెనుకంజ వేయడం లేదు. స్వయంగా తమకి జరిగిన వేధింపుల గురించి తామే బయట పెట్టడానికి కూడా భయపడుతున్న మహిళలకు ఈమె ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ చొరవను నిజంగా అభినందించాల్సిందే. 

Advertisement
CJ Advs

వైరముత్తుకి తమిళనాట ఉన్న పలుకుబడి ఇక్కడి సామాన్యులకు పెద్దగా తెలియకపోవచ్చు. ఇక ఈమె లైంగిక వేధింపుల విషయంలో బయటపెట్టిన కన్నడ సంగీత దర్శకుడు రఘుదీక్షిత్‌ వాటిని నిజమేనని ఒప్పుకున్నాడంటే ఈమె చేస్తున్న ఆరోపణల్లో ఎంత నిజాయితీ ఉందో అర్ధం అవుతోంది. ఇలాంటి మహిళలు చాలా అరుదుగా మాత్రమే ఉంటారు. అలాంటి వారికి అండగా నిలిచి, వారి గళానికి మద్దతు ఇవ్వాల్సింది పోయి కొందరు ఆమెనే తప్పుపడుతూ ఉండటం బాధాకరం. ఇక విషయానికి వస్తే, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళ రచయిత వైరముత్తుకి లై డిటెక్టర్‌ పరీక్షలు నిర్వహించాలని తాజాగా చిన్మయి శ్రీపాద తన ట్విట్టర్‌లో కోరింది. దీనిపై అందరి నుంచి ఆమెకి మద్దతు లభిస్తోంది. 

అయితే ఈ ట్వీట్‌పై స్పందించిన ఓ నెటిజన్‌ వైరమత్తు కంటే ముందుగా చిన్మయి శ్రీపాదకే లై డిటెక్టర్‌ పరీక్షలు నిర్వహించాలని ఎద్దేవా చేశాడు. దానికి ఆమె ఘాటుగా సమాధానం ఇచ్చి ఈ నెటిజన్‌కి సవాల్‌ విసిరింది. ఖచ్చితంగా నాకా ధైర్యం ఉంది. లై డిటెక్టర్‌ పరీక్షలకు నేను సిద్దం.. మరి ఆ ధైర్యం వైరముత్తుకు ఉందా? అని ప్రశ్నించింది. నాకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడే వైరముత్తు నాపై లైంగిక దాడి చేశాడు. ఓసారి వేడుక కోసం స్విట్జర్లాండ్‌కి వెళ్లినప్పుడు ఆయన నన్ను తన గదిలోకి రమ్మని బలవంతం చేశాడని మరోసారి తన ఆరోపణలను నొక్కి చెప్పి, ఆ నెటిజన్‌కి సవాల్‌ విసరడం ఆమెలోని నిజాయితీని బయటపెడుతోంది! 

Chinmayi Shocking Answer to Netizen :

Chinmayi Fight Inspiration to All 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs