పవన్ ఎప్పుడు ప్రజల్లోకి వస్తాడో.. ఎప్పుడేం మాట్లాడుతాడో తెలియదని తనని తాను మేధావిగా భావించుకునే కత్తిమహేష్ విమర్శిస్తుంటాడు. ఇంతకీ ఆయన ఎప్పుడు బయటికి వస్తాడో.. ఎప్పుడు ఏం మాట్లాడుతాడో స్వయాన కత్తికి తెలుసా? అనేదే ప్రశ్న. కత్తి స్థాయి మరచి మాట్లాడుతున్నాడనేది ఖచ్చితంగా వాస్తవం. పవన్ కనీసం జనసేన పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లాడు. కానీ కత్తి మాత్రం కేవలం పవన్‌ని మాత్రమే టార్గెట్ చేస్తాడు. అంతేగానీ ఆయనకు ఇతర విషయాలేమీ పట్టవు. ఆయనకు సమాజంలో జరుగుతున్న సంఘటనలు, అకృత్యాలు, రాజకీయనాయకుల అవినీతి ఇవేమీ కనిపించవు. కేవలం పవన్ మాత్రమే కనిపిస్తూ ఉంటాడు. కేవలం పవన్‌ని విమర్శించడం ద్వారానే తనకు తాను సెలబ్రిటీగా మారాలని, ఇతర పార్టీలు తనను చేరదీయాలనేది ఆయన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
అదేమంటే పవన్ ఎక్కడ పోటీ చేసినా ఆయనపై పోటీకి తాను సిద్దమని చెబుతూ ఉంటాడు. కనీసం ఆయనకు ఏ పార్టీ టిక్కెట్ ఇస్తుందో కూడా ఆయనకే తెలియదు. పవన్‌ని విమర్శించడం ద్వారా ఏదో ఒక పార్టీ తనకు టిక్కెట్ ఇవ్వకపోతుందా? అనేది ఆయన నైజంగా కనిపిస్తోంది. ఇక విషయానికి వస్తే అమావాస్య, పౌర్ణమికి ముందుకు వచ్చేకత్తి మహేష్ తాజాగా మరోసారి పవన్‌పై విమర్శలు గుప్పించాడు. గత కొంతకాలంగా పవన్ ఊసే ఎత్తని ఆయన మరోసారి విమర్శలను లంఘించుకున్నాడు.
కర్నూల్‌జిల్లాలోని ఎమ్మిగనూర్‌లో మాదిగల రాజకీయ చైతన్య సభలో ఆయన మాట్లాడుతూ.. బిజెపికి పవన్ ఏజెంట్. పవన్ ఒక్కో నియోజకవర్గంలో 500మందిని కూడా ప్రభావితం చేయలేడు. ఎవరు డబ్బులు ఇస్తే పవన్ వారికే వత్తాసు పలుకుతాడు. పవన్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో అయనకే తెలియదని విమర్శించాడు. కత్తిమహేష్ పవన్‌పై చేసిన విమర్శలన్నీ ఆయనకు కూడా చెందుతాయి. ఇది గురువింద గింజ సామెతను గుర్తుకు తెస్తోందనే చెప్పాలి. తన మాటలను వినే ఏదో పార్టీ టిక్కెట్ ఇస్తుందనే యావ తప్ప ఆయనలో మరో ఉద్దేశ్యం ఉన్నట్లు కనిపించడం లేదు. ఇంతకీ ఆయన వైసీపీనా, తెలుగుదేశమా? కమ్యూనిస్టా? కాంగ్రెస్సా? ఏ భావాలు ఆయనకు సరిపోతాయి? ఆయన సిద్దాంతాలు ఏమిటి? ఎంతసేపూ దళితకార్డును ఉపయోగించుకోవడం కాకుండా నిజంగా ఆయనకంటూ ఓ భావజాలం, సిద్దాంతాలు ఉన్నాయా? లేదా? అనేవి ఆయనకే తెలియాలి.