మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై లాంఛనంగా ప్రారంభమైన సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ‘చిత్రలహరి’
‘శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై మెగామేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో కొత్త చిత్రం ‘చిత్రలహరి’ ఈరోజు హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. సినిమా ముహూర్తపు సన్నివేశానికి కొరటాల శివ క్లాప్ కొట్టగా.. సాయిధరమ్ తేజ్ అమ్మగారు విజయ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ‘రంగస్థలం’ తర్వాత మెగా ఫ్యామిలీకి చెందిన హీరో.. సుప్రీమ్ హీరో సాయిధరమ్‌తేజ్‌తో మా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో సినిమా చేయనుండటం ఆనందంగా ఉంది. కూల్, ఎమోషనల్, హార్ట్ టచింగ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించడంలో బెస్ట్ డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది. అన్ని ఎలిమెంట్స్‌తో సాయిధరమ్‌తేజ్‌ను సరికొత్త యాంగిల్‌లో ప్రెజెంట్ చేస్తున్నాం. నవంబర్ మొదటివారం నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్. అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పించేలా సినిమాను రూపొందిస్తాం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తాం’’ అన్నారు.
సాయిధరమ్‌తేజ్, కల్యాణి ప్రియదర్శన్ హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాశ్, సి.ఇ.వో/ సి.ఒ.ఐ: పి.చిరంజీవి, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, లైన్ ప్రొడ్యూసర్: కె.వి.వి.బాల సుబ్రమణ్యం, కో-ప్రొడ్యూసర్: ఎం.ప్రవీణ్, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం), దర్శకత్వం: కిషోర్ తిరుమల.