Advertisement
Google Ads BL

ప్రభాస్ ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ ఎప్పుడంటే?


ప్రభాస్ బాహుబలితో ప్రేక్షకుల దగ్గరికి వచ్చి చాలా రోజులు అవుతుంది. మధ్య మధ్యలో అక్కడక్కడా కనబడడం తప్ప ప్రభాస్ కొత్త సినిమా నుండి లేటెస్ట్ లుక్ లాంటివేమీ బయటికి రాలేదు. స్టార్ హీరోల సినిమాలు అలా తెరకెక్కి ఇలా లుక్స్ తో సందడి చేస్తూ వారి అభిమానులు కోలాహలంగా వుంటుంటే.... ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఉసూరుమంటున్నారు. తమ హీరో నుండి లేటెస్ట్ అప్‌డేట్ ఎప్పుడొస్తుందో అంటూ ఎదురు చూస్తున్నారు.

Advertisement
CJ Advs

ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో, రాధాకృష్ణ దర్శకత్వంలో రెండు భారీ బడ్జెట్ మూవీస్ లో నటిస్తున్నాడు. సాహో సినిమా మొదలు పెట్టి చాలా రోజులు గడుస్తున్నాయి. కానీ ఆ సినిమా షూటింగ్ మాత్రం కంప్లీట్ కాలేదు. ఇక రాధాకృష్ణ సినిమాని రీసెంట్ గానే మొదలుపెట్టారు. ప్రభాస్ రెండు సినిమాల షూటింగ్స్ ని బ్యాలెన్సుడ్ గా పూర్తి చేస్తున్నాడు ప్రభాస్. అయితే ప్రభాస్ పుట్టిన రోజు ఈ నెలలోనే ఉండడంతో.. ప్రభాస్ సినిమాల లుక్స్ బయటికొస్తాయనే ఆశతో ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ పుట్టినరోజైన అక్టోబర్ 23 న ప్రభాస్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఉండబోతుందని అంటున్నారు.

ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సాహో టీజర్ ను ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23 కంటే ఒక రోజు ముందుగానే అక్టోబర్ 22 న విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా జిల్  రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను కూడా అదే రోజు విడుదల చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే  ప్రభాస్ ప్రస్తుతం సాహో షూటింగ్ కి బ్రేకివ్వగా..రాధాకృష్ణ మూవీ మాత్రం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటుంది. మరి ప్రభాస్ రెండు ప్రాజెక్ట్ ల నుండి లుక్స్ బయటికొస్తున్నాయి అంటే...  ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే అన్నమాట. అయితే ఈ రెండు విషయాల గురించి అఫిషీయల్‌గా న్యూస్ ఇంకా బయటికి రాలేదు.

Double Treat for Prabhas on That Day:

Saaho Teaser and Radhakrishna Movie First Release on Prabhas Birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs