Advertisement
Google Ads BL

నయన్ అందుకే పెళ్లి చేసుకోవడం లేదా?


మనదేశంలో ఇప్పుడు ఉన్న మహిళా నాయకులను, మరణించిన అమ్మ జయలలితను ఉదాహరణగా తీసుకుంటే 'జయలలిత, మాయావతి, మమతా బెనర్జీ' వంటి వారు ముఖ్యమంత్రులు అయ్యారు. పెళ్లికి ముందు వారికి ఉండే ఎఫైర్లను పక్కన పెడితే వీరంతా పెళ్లి చేసుకోని బ్రహ్మచారిణులు. ఇక వాజ్‌పేయ్‌, మోదీ మాటల ప్రకారం ఆయనకు కూడా భార్య లేదు.. లేదా వదిలేసింది. ఇక విషయానికి వస్తే తాజాగా దక్షిణాది లేడీ సూపర్‌స్టార్‌ నయనతారకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే నయనతార, శింబుల మధ్య ఎఫైర్‌ నడిచింది. వారి హాట్‌హాట్‌ కిస్సింగ్‌ ఫొటోలు కూడా బయటకు వచ్చి సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత శింబు, నయనని మోసం చేశాడని, అతనో ప్లేబోయ్‌ అనే వార్తలు కోలీవుడ్‌ మీడియాలో బాగా వచ్చాయి. ఆ తర్వాత నయన మరోసారి పెళ్లై పిల్లలు ఉన్న దర్శకుడు, నటుడు, ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ అయిన ప్రభుదేవాతో ఎఫైర్‌ నడిపింది. ఇది పెళ్లిపీటల వరకు వచ్చింది. కానీ ప్రభుదేవా మొదటి భార్య పోరాటం సాగించడంతో ప్రభుదేవా సైతం ఆమెకి హ్యాండిచ్చాడు. 

Advertisement
CJ Advs

ఇక ప్రస్తుతం నయన దర్శకుడు విఘ్నేశ్‌తో సహజీవనం చేస్తోందని, వారిద్దరు ఒకే అపార్ట్‌మెంట్‌లోని ఒకే ప్లాట్‌లో కలిసి ఉంటున్నారని వార్తలు వచ్చాయి. విఘ్నేశ్‌ పుట్టినరోజు వేడుకలను నయన స్వయంగా గ్రాండ్‌గా జరుపుతుండటం, ఇటీవల స్వర్ణ దేవాలయంలో కూడా ఈ జంట దిగిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఇక నయనతో పెళ్లి విషయంపై విఘ్నేశ్‌ మాట్లాడుతూ, ముందుగా నయన తన అభిప్రాయం చెప్పాలని, ఆ తర్వాత తన తల్లి ఓకే అనాలని నయన ఒకే అనకుండా తానేం సమాధానం చెప్పగలను అంటూ కాస్త దాటవేత ధోరణిలో జవాబిచ్చాడు. ఇక వీరిద్దరు వివాహం కూడా చేసుకున్నారని, కానీ నయన కెరీర్‌ ఇప్పుడు స్టార్‌ హీరోలతో సమానంగా, లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతూ ఉండటంతో వారి వివాహం విషయం రహస్యంగా ఉంచుతున్నారని కూడా కోలీవుడ్‌ మీడియా అంటోంది. 

ఇక తాజాగా తమిళ దర్శకుడు జీటీ నందు నయనతారకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం చెప్పుకొచ్చాడు. శింబు, నయనతారల ప్రేమ వ్యవహారం, వారు విడిపోవడంపై పలు కారణాలు ప్రచారంలో ఉన్నాయని ఆయన తెలిపాడు. అయితే తనకి తెలిసిన ఓ కారణం కరెక్ట్‌ అయి ఉండవచ్చన్నాడు. చాలా కాలం కిందట తాను, శింబుకి చెందిన ఓ వ్యక్తి ఓ జ్యోతిష్కుడి వద్దకు వెళ్లి నయన,శింబుల జాతకాలు ఆ జ్యోతిష్కునికి చూపించారట. వారి జాతకాలను పరిశీలించిన జ్యోతిష్కుడు నయన పెళ్లి చేసుకుంటే ఆమె జీవితం నడిరోడ్డున పడుతుందని, పెళ్లి చేసుకోకపోతే మాత్రం ఆమెకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పాడని, నయన్‌ ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి ఇదే అసలు కారణమై ఉండవచ్చని చెప్పుకొచ్చాడు. అయితే నయన ఈ విషయం తెలిసి మరీ రెండోసారి ప్రభుదేవాతో పెళ్లి పీటల వరకు ఎందుకు వ్యవహారం నడిపిందనే దానికి మాత్రం సమాధానం దొరకడం లేదు. 

Shocking Reason Behind Nayanthara And Simbu Break Up:

This is the Reason why Nayanthara not marry
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs