తనను కాపీక్యాట్ అనడంపై తమన్ తీవ్రంగా స్పందించాడు. ప్రతి ఒక్క సంగీత దర్శకునికి ఒక్కో స్టైల్ ఉంటుంది. అలాగని వారు కాపీ చేస్తున్నారంటే ఎలా? నా ట్యూన్స్‌ని నేను కాస్త మెరుగుపరుచుకున్నా దానిని కాపీ అని ఎందుకు అంటారు? ఈ విమర్శలను నేను పట్టించుకోను. అగ్రసంగీత దర్శకులు ఎవరు నన్ను అలా అనలేదు. నేను మౌనంగా ఉంటున్నానని ఇలా విమర్శలు చేస్తున్నారు. త్రివిక్రమ్‌తో పనిచేయాలని ఎనిమిదేళ్లుగా ప్రయత్నిస్తున్నా. ఇంత కాలానికి నా కోరిక తీరింది. కమర్షియల్ సినిమా అంటే మాస్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ అనే లెక్కలు ఉంటాయి. వాటికి అతీతంగా ఈ చిత్రానికి పనిచేశాను. ఈ రోజు అందరి ప్రశంసలు అందుకోవడానికి కారణం కథాబలం ఉన్న చిత్రానికి సందర్భానుసారంగా అందించిన సంగీతమే. 'సరైనోడు'తో నా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. ఫాస్ట్ బీట్ పాటలు తగ్గించాను. ఈమధ్యకాలంలో నా పంథాని మార్చుకున్నాను. దర్శకుల్లో కూడా మంచి మార్పు కనిపిస్తోంది. రిఫరెన్స్ చూపించకుండా బాణీలు కట్టమని ప్రోత్సహిస్తున్నారు. నేనే గనుక కాపీ వాడిని అయితే 60 చిత్రాలకు పనిచేయడం సాధ్యమా? త్రివిక్రమ్ వంటివారు చాన్స్ ఇచ్చేవారా? ఎన్నో దాటుకొస్తే గానీ సంగీత దర్శకునిగా రాణించలేం.
ఇక ఈ చిత్రానికి మొదట 'అజ్ఞాతవాసి'కి సంగీతం అందించిన అనిరుధ్‌ని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆస్థానంలో నన్ను తీసుకున్నారు. అనిరుధ్‌ని మార్చి నాకు అవకాశం ఇవ్వడం వల్ల ఈ సినిమాకి మరింత కష్టపడి పనిచేయాలనే కసి పెరిగింది. ఎన్టీఆర్-త్రివిక్రమ్‌ల గారి మీద ఉన్న నమ్మకం మరింత కష్టపడేలా చేసింది. ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా ఈ చిత్రాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని పనిచేశాను. అందుకు తగ్గ ఫలితం ఆడియన్స్ ఆదరణ వల్ల నిజమైందని నిరూపితం అయింది. ఈ చిత్రం విడుదలైన వెంటనే అనిరుద్ ఫోన్ చేసి అభినందించడం గొప్ప విషయం.. అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రంలో 'పెనిమిటి' పాట సాహిత్యపరంగా, ట్యూన్‌పరంగా ఓ క్లాసిక్‌గా నిలిచేది. కానీ సరైన చిత్రీకరణ లేకపోవడంతో ఈ పాటని ప్రేక్షకులు పట్టించుకోకుండా వదిలేస్తున్నారు.
ఇక బిజీఎం అందించడంలో మణిశర్మ తర్వాత తమన్‌నే చెప్పాలి. ఇప్పటికే ఈయన 'సైరా.. నరసింహారెడ్డి' వంటి ప్రెస్టీజియస్ చిత్రం ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌కి అద్భుతమైన స్కోర్ అందించాడు. ఇక తాజాగా ఆయనకు 'సాహో' చిత్రం మోషన్ వీడియోకి కూడా బిజీఎం ఇచ్చే అవకాశం లభించింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తమన్ 'భాగమతి, తొలిప్రేమ'.. తాజాగా 'అరవింద సమేత' ద్వారా కొత్తదనంతో తన సత్తా చాటుతున్నాడు.