Advertisement
Google Ads BL

‘అరవింద..’ హిట్‌తో మహేష్, ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీ!


 

Advertisement
CJ Advs

నిన్నటి వరకు ప్లాప్ హీరోయిన్‌గా పేరున్న పూజాహెగ్డే అరవింద సమేత‌ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించింది. అమ్మో ఐరెన్ లెగ్ హీరోయిన్ అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా టెంక్షన్ ఫీల్ అయ్యారు. కానీ గురువారం విడుదలైన అరవింద సమేత - వీర రాఘవ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఎన్టీఆర్ సరసన అరవింద కేరెక్టర్ లో మెరిసిన పూజాహెగ్డేకి అరవింద ముందు వరకు హిట్ అయిన సినిమానే లేదు. ఒక లైలా కోసం, ముకుంద, డీజే వంటి సినిమాలు బావున్నాయనిపించినా.. ఆ సినిమాలు హిట్ కాకపోవడంతో.. పూజాహెగ్డే ని ఐరెన్ లెగ్ అనేశారు. కానీ అరవింద సమేత హిట్ అవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త కుదురుపడ్డారు.

కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ తో పాటుగా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఊపిరి పీల్చుకున్నారు. పూజా నటించిన అరవింద సమేత హిట్ అవడంతో.... మహేష్ తో మహర్షి సినిమాలో చేస్తున్న పూజాహెగ్డే విషయంలో కాస్త ఊపిరి పీల్చుకున్నారు మహేష్ ఫ్యాన్స్. అరవింద టాక్ కోసం ఎదురు చూసిన మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఐరెన్ లెగ్ ముద్ర నుండి బయటికొచ్చిన పూజాహెగ్డే విషయంలో అనుమానాలు పక్కన పడేశారు.

అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అరవింద సమేత హిట్ తో కాస్త జోష్ లోకెళ్లారు. ప్రభాస్ తో పూజాహెగ్డే.. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ 20 లో నటిస్తుంది. ఇక అరవింద సమేతలో అరవిందగా పూజాహెగ్డే గ్లామర్ కి మంచి పేరే వచ్చింది. అయితే పూజాహెగ్డే వాయిస్ మాత్రం అంత సెట్ కాలేదనే విమర్శలొచ్చాయి. మహేష్ పక్కన కూడా పూజా గ్లామర్ తో పడేస్తుందని.. ప్రభాస్ పక్కన కూడా హైట్ తో పూజా అదరగొడుతుందనే ధీమాలో మహేష్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు.

Mahesh and Prabhas Fans Happy with Aravinda Sametha Success:

Pooja Hegde Turns Golden Leg 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs