Advertisement
Google Ads BL

మహేష్ లుక్ చూశారా.. హాలీవుడ్‌ జేమ్స్‌బాండ్‌!


'బ్రహ్మో త్సత్సం, స్పైడర్‌' లు తీవ్రంగా నిరాశ పరచినా 'భరత్‌ అనే నేను'తో మహేష్‌ అభిమానులందరికీ గొప్ప గిఫ్ట్‌ ఇచ్చాడు. ఇక ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మహేష్‌ని కాస్త రగ్గ్‌డ్‌గా చూడాలని ఉందని కోరడం, మహేష్‌ కూడా తన తదుపరి చిత్రంలో అలానే కనిపిస్తానని చెప్పడం జరిగాయి. ఇక ప్రస్తుతం మహేష్‌ తన 25వ చిత్రంగా దిల్‌రాజు-అశ్వనీదత్‌ల నిర్మాణ భాగస్వామ్యంలో ప్రతిష్టాత్మకంగా 'మహర్షి' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్‌తో పాటు విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో కూడా మహేష్‌ చేతిలో ఫైల్‌ మోసుకుంటూ కాస్త గడ్డం, మీసాలతో కనిపించాడు. దీంతో ఆయన 'మహర్షి' చిత్రంలో నిరుద్యోగి పాత్రను చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. 

Advertisement
CJ Advs

మరోవైపు ఈ చిత్రం షూటింగ్‌.. కథ పరంగా కొంత ఇండియాలో, మరికొంత యూఎస్‌లో జరుగుతోంది. దీంతో ఇందులో మహేష్‌ ఇండియాలో జరిగే సన్నివేశాలలో గడ్డం, మీసాలతో ఉంటాడని, అమెరికా పార్ట్‌లో మాత్రం ఎంతో స్టైలిష్‌గా ఉంటాడని అంటున్నారు. ఇక తాజాగా సోషల్‌ మీడియాలో మహేష్‌కి సంబంధించిన ఓ పిక్‌ హల్‌చల్‌ చేస్తోంది. ఇందులో ఆయన సూటుబూటులో సీఈవోలాగా, బడా పారిశ్రామికవేత్తగా కనిపిస్తున్నాడు. క్లీన్‌షేవ్‌తో పాటు కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకుని, అమెరికన్‌ 'బిజినెస్‌మేన్‌'గా కనిపిస్తున్నాడు. ఈ లుక్‌లో మహేష్‌ హ్యాండ్సమ్‌ని చూస్తే ఎవరికైనా కన్ను కుట్టక మానదు. 

ఇక మరోవైపు ఇది సినిమాలోని స్టిల్‌ కాదని, పర్సనల్‌ ఫొటో అని కూడా అంటున్నారు. ఇవి జర్మనీలో ట్రిప్‌ సందర్భంగా తీసిన ఫోటో అనే టాక్‌ కూడా ఉంది. మరి ఏ విషయం తెలియాలంటే కొంత కాలం వెయిట్‌ చేయాల్సిందే. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్‌ని విజయదశమి రోజున విడుదల చేస్తారట. ఇక ఈ పిక్‌లో మహేష్‌ని చూస్తుంటే ఎంత అందగత్తె హీరోయిన్‌ అయినా మహేష్‌తో గ్లామర్‌పరంగా సరితూగలేరని అనిపిస్తోంది. ఇతను నిజంగా హాలీవుడ్‌ జేమ్స్‌బాండ్‌లా ఉన్నాడనేది నిజం..!

Mahesh Babu Leaked Pic Sensation in Social Media:

Mahesh Latest Pic: Hollywood Jamesbond
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs