Advertisement
Google Ads BL

అసలైన మృగాలు ఇంకా బయటకి రాలేదు!


తెలుగులో నటించిన ఉత్తరాది బ్యూటీ, సొట్ట బుగ్గల సుందరి తాప్సిపన్ను గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు. ఎన్ని తెలుగు చిత్రాలలో నటించినా ఈ అమ్మడికి స్టార్‌ స్టేటస్‌ రాలేదు. తన మొదటి తెలుగు చిత్రమే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన 'ఝుమ్మందినాదం'లో నటించే చాన్స్‌ దక్కించుకుంది. కానీ సరైన హిట్స్‌ లేక దెబ్బతింది. దాంతో ముంబై ఫ్లైట్‌ ఎక్కిన ఈమెకి అనూహ్యంగా బాలీవుడ్‌లో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఈమె హిందీకి వెళ్లిన వెంటనే తెలుగులో ఆమె అంతకు ముందే నటించిన 'ఆనందోబ్రహ్మ' మంచి విజయం సాధించింది. ఇక బాలీవుడ్‌లో ఈమె 'జుద్వా 2'లో బికినీ షోలతో పాటు కమర్షియల్‌ చిత్రాలకంటే కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ చిత్రాలను దక్కించుకుంటూ ఉండటం విశేషం. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'గేమ్‌ ఓవర్‌' అనే చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రం టైటిలే కాదు.. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ కూడా బాగా ఆకట్టుకుంటోంది. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే తాప్సి కూడా డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌గా పేరు తెచ్చుకుంది. రాఘవేంద్రరావు చిత్రాలలోని పాటలలో హీరోయిన్ల బొడ్డుల మీద పండ్లు, పూలు వేసే ధోరణిని విమర్శించి తెలుగు ప్రేక్షకుల ఆగ్రహానికి గురైంది. తాజాగా ఆమె దేశాన్ని, మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమను వేధిస్తూ, సంచలనాలు సృష్టిస్తోన్న 'మీటూ' విషయంలో స్పందించింది. బాలీవుడ్‌ నటులు నానాపాటేకర్‌, అలోక్‌నాథ్‌, దర్శకుడు సుభాష్‌, సాజిద్‌ ఖాన్‌, తమిళ రచయిత వైరముత్తు, కేంద్రమంత్రి ఎంజె అక్బర్‌ వంటి వారు లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే వార్తలపై ఆమె స్పందిస్తూ, 'మీటూ' కింద బాధితులు బయటపెడుతున్న పేర్ల కంటే వారు ఏ విధంగా లైంగిక వేధింపులకు గురయ్యారో వింటుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఇప్పటి వరకు బాధితులు చెప్పిన పేర్లు కొన్ని మాత్రమే. మహిళా ఆర్టిస్టులను, నటీమణులను వేధించుకుతినే మృగాళ్ల పేర్లు బయటకు రాలేదనిపిస్తోంది.... అంటూ తన మనసులోని అభిప్రాయాలను తెలిపింది. 

ఈ ట్వీట్‌ని బట్టి చూస్తే ఇలాంటి ఎందరో మృగాళ్ల పేర్లు తాప్సిపన్నుకి తెలుసుననే అర్ధం అవుతోంది. తాజాగా ఈమె ఎవరి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసింది? అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో ఈమె బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌తో కూడా నటించింది. తాజాగా హెయిర్‌స్టైలిస్ట్‌ సప్నా అమితాబ్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన నేపధ్యంలో రాబోయే రోజుల్లో తాప్సి కూడా ఇలాంటి వారి పేర్లను బయటపెట్టే అవకాశాలున్నాయని బిటౌన్‌ భావిస్తోంది. 

Tapsee Comments about METOO :

Tapsee Comments on METOO Movement Archives
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs