Advertisement
Google Ads BL

మెగాస్టార్‌పై కూడా ‘మీటు’ ఆరోపణలు??


బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌. ఈయన ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై తిరుగేలేని సూపర్‌స్టార్‌గా పరిశ్రమను శాసించాడు. ఇక ఈయన మంచి వయసులో ఉండగా నాటి టాప్‌ హీరోయన్‌ రేఖతో ఎఫైర్‌ నడిపాడు. ఈ విషయం అందరికీ తెలుసు. 'కూలీ' చిత్రం షూటింగ్‌ సందర్భంగా అమితాబ్‌కి గాయం తగిలి, ఆసుపత్రిలో ప్రాణాపాయ దశలో ఉన్నప్పుడు రేఖ స్వయంగా అమితాబ్‌ కోలుకోవాలని తిరుమల వెంకటేశ్వరస్వామిని మొక్కుకుని ఆ తర్వాత తిరుమలకు కాలినడకన మెట్లపై నడిచి వెళ్లింది. ఆ తర్వాత కూడా అమితాబ్‌కు పలువురు హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. ఇక ఈయన తాను ప్రేమించిన తన సహనటి, హీరోయిన్‌ జయబాధురిని వివాహం చేసుకున్నాడు. ఇక అమితాబ్‌ విషయానికి వస్తే ఆయనను ఆయన సామాజిక వేత్తగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి ఉన్నతమైన వ్యక్తి బిజెపి ప్రభుత్వంలో ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌ వంటి చోట్ల మైనర్లు బాలికలను రేప్‌ చేసి చంపేయడం గురించి మీడియా అడిగినప్పుడు కూడా ఆయన దాటవేసే ప్రయత్నం చేశాడు. 

Advertisement
CJ Advs

ఇక ఇటీవల నానాపాటేకర్‌-తనుశ్రీ దత్తాల ఎపిసోడ్‌లో కూడా దీనిపై స్పందిస్తూ... నేనేమి నానా పాటేకర్‌ని కాదు.. తనుశ్రీ దత్తాను అసలే కాదు.. కాబట్టి ఆ విషయం నేను ఎలా మాట్లాడుతాను అని చెప్పాడు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇండస్ట్రీ లెజెండ్‌గా ఉన్న అమితాబ్‌ వంటి వ్యక్తి ఇలాంటి వాటిని ఖండించాల్సింది పోయి ఎవరో ఏదో అనుకుంటారని అలా మాట్లాడటం పలు చర్చలకు దారితీసింది. 'ఇటీవల అమితాబ్‌ ఓ ఆంగ్ల పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఏ మహిళ కూడా లైంగిక వేధింపులు ఎదుర్కోకూడదు. ముఖ్యంగా ఆమె పనిచేసే వాతావరణంలో ఇలాంటివి ఎదురైనప్పుడు సదరు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మన సమాజంలో మహిళలకు, పిల్లలకు ప్రత్యేకమైన రక్షణ కల్పించాలి. మనదేశంలో పని చేసే ప్రదేశాలలోనే మహిళలు ఎక్కువగా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఇది మనసును కలచి వేస్తోంది. వారికి దక్కాల్సిన గౌరవం, రక్షణ ఇవ్వలేకపోతే మనదేశంపై చెరిపేసుకోలేని మచ్చ పడుతుంది' అని చెప్పుకొచ్చాడు. 

దీనిపై హెయిర్‌ స్టైలిష్‌ సప్నా మాట్లాడుతూ, 'ఇది చాలా పెద్ద అబద్దం. సార్‌.. మీరు నటించిన 'పింక్‌' సినిమా వచ్చింది... వెళ్లిపోయింది. అదే విధంగా మీకున్న సామాజిక వేత్త అనే బిరుదు కూడా పోతుంది. త్వరలో మీ నిజాలు బయటపడతాయి. నా ట్వీట్‌ చదివి మీరు కంగారులో చేతులు కొరుక్కుంటూ ఉంటారు. ఎందుకంటే కొరుక్కోవడానికి మీకున్న గోళ్లు సరిపోవు' అని ట్వీట్‌ చేసింది. దీనిపై ప్రస్తుతం సంచలనాత్మక చర్చలు సాగుతున్నాయి. ఇలా మహిళల వేధింపులో అమితాబ్‌ కూడా ఉన్నాడని కాబట్టే ఆయన ఇంత కాలం దానిని గురించి మాట్లాడలేదని అంటున్నారు. మరి సప్నా చెప్పిన విషయాలను ఆమె బయటపెడుతుందా? లేదా? అనేది చూడాల్సివుంది..! 

Hair Stylist Sapna Bhavnani Attacks Amitabh Bachchan?:

Sapna Bhavnani attacks Amitabh Bachchan, says 'Your truth will come out soon'
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs