స్టార్ హీరోయిన్‌గా అందరు స్టార్స్‌తో కలిసి నటించిన సమంత పెళ్లయినా కూడా తన దూకుడు చూపిస్తూనే ఉంది. ఈమె ఎంత స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తో అంతటి సమాజసేవ విషయంలో కూడా అంతే ఉత్సాహం చూపుతుంది. ఇప్పటికే ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తోన్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. వాళ్లు అడిగే సరదా ప్రశ్నలకు మరింత అల్లరిగా సమాధానం చెబుతుంది. తాజాగా మీటూ ఉద్యమం విషయంలో పలువురు నెటిజన్లు దానిపై మాట్లాడిన తీరు, వారి వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 'మీటూ' ఉద్యమంపై సమంత స్పందిస్తూ.. గాయని చిన్మయి శ్రీపాద చెప్పిన విషయాలను నేను నమ్ముతున్నాను.
ఎప్పుడో పదేళ్లకిందట జరిగిన దానిని ఇప్పుడు ఎందుకు బయటపెడుతున్నారు అని కొందరు అడుగుతున్నారు. మా భయం కూడా అదే. తప్పంతా నాదేనని మీరు అంటారు. అలా మీ నుంచి భయపడి సందర్భం వచ్చినప్పుడు చెబుతున్నారు. దీనిపై గౌరవ్ ప్రధాన్ అనే నెటిజన్ సమంతను ఓ ప్రశ్న అడిగాడు. ఈరోజు మా అబ్బాయి నన్ను ఓ ప్రశ్న అడిగాడు. డాడీ అసలు మీటూ ఉద్యమం అంటే ఏమిటి? అన్నాడు. దానికి నేను 'మీటూ' అంటే 'ఆడవాళ్ల రిటైర్‌మెంట్ భీమాపథకం' అని చెప్పాను అప్పుడు మా అబ్బాయి 'అంటే ఏమిటి? అని మరలా ప్రశ్నించాడు. దానికి నేను 'ఆడవాళ్లు ప్రతి విషయంలోనూ తల దూరుస్తారు. కెరీర్ ముగిసిన తర్వాత ఈ భీమా పథకాన్ని వాడుకుంటారు. అప్పుడు వారి గురించి విలేకరులు వార్తలు రాస్తూ ఉంటారు...' అని చెప్పాను. దానికి మా అబ్బాయి 'గాడ్ బ్లెస్ ఇండియా' అన్నాడు అని చెప్పుకొచ్చాడు.
ఈ కామెంట్లపై తీవ్రంగా స్పందించిన సమంత అదే మాట 'మీ అమ్మాయి మిమ్మల్ని అడిగి ఉంటే ఏం సమాధానం చెబుతావు' అని ఘాటుగా స్పందించడంతో సదరు నెటిజన్ సమాధానం చెప్పలేకపోయాడు. మరి సామ్ అంటే మాటలా? ఆమె నేటితరం యువతులకు రోల్‌మోడల్ అని కూడా చెప్పవచ్చు.