కమెడియన్ గా మంచి పీక్ స్టేజ్‌లో ఉన్న సునీల్ హీరోగా టర్న్ అయ్యాడు. మొదట్లో రాజమౌళి లాంటి దర్శకుడి అండ దొరికిన సునీల్‌కి తర్వాత మాత్రం హీరోగా సరిగ్గా నిలబడలేకపోయారు. అయితే తాను మళ్ళీ సినిమాల్లో కమెడియన్ వేషాలెయ్యాలి అంటే... త్రివిక్రమ్ లాంటి ఫ్రెండ్ ఉన్నాడులే అనే ధీమాతో సునీల్ ఉన్నాడనే విషయం ఈమధ్య జరిగిన అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు. ఇక హీరోగా డల్ అయిన టైంలో సునీల్ మళ్ళీ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవడం.. అదే టైంలో సునీల్ ఆప్తమిత్రుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో అరవింద సమేత పెద్ద ప్రాజెక్ట్ మొదలు పెట్టడం అందులో సునీల్ కి మంచి పాత్ర ఇవ్వడం జరిగాయి.
అయితే ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న కథలో ఎలాంటి కామెడీతో త్రివిక్రమ్ అద్భుతాలు చేస్తాడో అని అనుకున్నారు. అయితే సునీల్ చెప్పిన కథతో మొదలైన అరవింద సమేతలో నీలాంబరిగా సునీల్ కి మంచి పాత్రే దక్కింది. అయితే అరవిందలో ఎమోషనల్ గా సునీల్ బాగా మెప్పించాడు. కానీ కథలో కామెడీకి చోటు లేకపోవడంతో సునీల్ కి ఎక్కువగా కామెడీ చేసే అవకాశం మాత్రం దక్కలేదు. నీలాంబరిగా, వీర రాఘవకు (ఎన్టీఆర్) స్నేహితుడిగా మంచి మార్కులే సంపాదించాడు. కామెడీకి దూరంగా కథలో భాగమయ్యాడు సునీల్. అయితే ఈ తరహా పాత్రలతో డిస్టెన్స్ ఏర్పడినా కానీ కమెడియన్‌గా ఇంకా ఫామ్‌లోనే వున్నాడనేది ఈ అరవింద సమేత తో క్లారిటీ వచ్చేస్తుంది.
ఇక ఈ సినిమాతో సునీల్ తన పాత దారిలోకి వచ్చేశాడు. ఇకపై హీరోగా అవకాశాలు వచ్చే ఛాన్స్ లేదని కూడా మనం ఫిక్స్ అవ్వవచ్చేమో. మరి గ్యారేజ్ ఓనర్‌గా హాస్యం పండించకపోయినా.. కథకు కనెక్ట్ అయ్యే కేరెక్టర్‌లో ఇరగదీశాడనే చెప్పాలి. ఇక అరవింద సమేతలో నిజంగానే త్రివిక్రమ్ సునీల్ కి మంచి పాత్ర ఇచ్చి ఆదుకున్నాడనే చెప్పాలి. ఇక ఈ సినిమాతో సునీల్‌కి మళ్ళీ బిగ్ ప్రాజెక్ట్స్ లో కమెడియన్ గా కానీ, ఇలా కేరెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు కానీ రావడం మాత్రం ఖాయం.