నేడు ఎక్కడ చూసినా మీటూ ఉద్యమాల న్యూస్‌లే కనిపిస్తున్నాయి. కొందరు నటీమణుల ఆరోపణలు నిజం కావచ్చు గానీ ప్రతి ఒక్కరు తమపై లైంగిక వేధింపుల విషయంలో నిజాయితీగా చెబుతున్నారా? అనేది సందేహమే. దీనికి పెరిగిన మీడియా ప్రాబల్యం వల్ల తాము వార్తలో ఉండి, సెలబ్రిటీలుగా మారాలనుకునే వారు ఉన్నారు. ఇక కాస్టింగ్‌కౌచ్ అనేది కేవలం సినిమా ఫీల్డ్‌లోనే కాదు.. అన్ని రంగాలలో కూడా ఉన్నాయనేది వాస్తవం. ఓ తప్పు జరిగి అది రేప్ కిందకి రాకుండా ఆడమగా ఇద్దరు ఇష్టపూర్వకంగా పాల్గొని చేసినవారు ఆ తర్వాత కేవలం మగాళ్లదే తప్పు అని చెప్పడం సమంజసం కాదు. తాము పైకి ఎదిగే దాకా దేనికైనా కాంప్రమైజ్ అయిపోయి కాస్త పేరు, గుర్తింపు రాగానే ఇతరులను టార్గెట్ చేయడం సరికాదు.
ఇక విషయానికి వస్తే ప్రముఖ తమిళ రచయిత, సినీ గేయ రచయిత అయిన వైరముత్తు తమని ఎన్నో విధాలుగా వేధించాడని పలువురు మహిళా ఆర్టిస్ట్‌లు ఆరోపించిన సంగతి తెలిసిందే. వీటిని గాయని చిన్మయి శ్రీపాద సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఈ నేపధ్యంలో తనపై వచ్చిన విమర్శలు, ఆరోపణలపై వైరముత్తు స్పందించాడు. దేశంలోని ప్రముఖులపై ఇలాంటి ఆరోపణలు చేయడం తప్పుడు ప్రచారం చేయడం అనేది నేడు ఫ్యాషన్‌గా మారిపోయింది. నన్ను కావాలని అవమాస్తున్నారు. దీనిపై నాకెంతో ఆవేదనగా ఉంది. ఇప్పుడు తప్పుడు ఆరోపణల గురించి నేను స్పందించను. కాలమే అన్నింటికి సమాధానం ఇస్తుంది.. అని చెప్పుకొచ్చాడు.
పెదాలపై మజ్జిగ ఉందంటూ తనని బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడని ఓ గాయని తాజాగా వైరముత్తుపై ఆరోపణలు చేసింది. దీనిని చిన్మయి శ్రీపాద బయటపెట్టారు. అయితే ఎవరో ఒకరు ఆరోపిస్తే నమ్మలేం గానీ ఏకంగా చాలా మంది వైరముత్తుపై ఆరోపణలు చేయడం మాత్రం అనుమానాలకు తావిస్తోంది.