Advertisement
Google Ads BL

తనుశ్రీదత్తా ఆ పని కూడా చేసేసింది


ఇటీవల తనుశ్రీదత్తా తనను ఓ సినిమా పాటలో భాగంగా నానా పాటేకర్‌ అసభ్యంగా ప్రవర్తించాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకాలం నానాని అందరు దేవుడిలా భావించేవారు. కానీ అందరు ఇందులో నిజమెంత అనే చర్చల్లో మునిగితేలుతున్నారు. మరోవైపు నానా పాటేకర్‌ తాను మీడియాకు ఏమీ చెప్పనని, చట్టప్రకారమే తనుశ్రీపై చర్యలు తీసుకుంటానని ప్రకటించాడు. మరోవైపు ఈయన ఈ విషయంలో మీడియా ముందుకు త్వరలో రానున్నాడని కూడా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంఘటన మరింత జటిలం అయింది. 

Advertisement
CJ Advs

పదేళ్ల కిందట తనని ఓ సినిమా డ్యాన్స్‌ షూటింగ్‌లో నానా పాటేకర్‌ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించిన ఆమె తాజాగా ఈ విషయంపై 40 పేజీల డాక్యుమెంట్స్‌ని తయారు చేసింది. వాటిని ముంబై పోలీసులకు ఇచ్చి వారిని ఆశ్రయించింది. తనుశ్రీ దత్తా న్యాయవాది ఒషివరా పోలీస్‌స్టేషన్‌తో పాటు రాష్ట్ర మహిళా కమిషన్‌కి ఈ డాక్యుమెంట్లను అందజేశారు. 2008లో జరిగిన ఈ వేధింపు ఘటనపై తనుశ్రీ దత్తా తండ్రి తపన్‌కుమార్‌ దత్తా నాడే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించాడట. ప్రస్తుతం దానితో పాటు ఈ డాక్యుమెంట్లను కూడా ఎఫ్‌ఐఆర్‌తో దాఖలు చేశారు. 

డ్యాన్స్‌ సీక్వెన్స్‌ షూటింగ్‌ రద్దయిన తర్వాత తమ కారుపై పలువురు పాత్రికేయులు దాడి చేశారని తనుశ్రీ తండ్రి చేసిన ఫిర్యాదులోని ఆధారాల వివరాలు ఈ పత్రాలలో ఉన్నాయి. మరి ఒకవైపు నానా పాటేకర్‌, మరో వైపు తనుశ్రీదత్తాలు కూడా చట్టప్రకారమే నడుచుకుంటూ ఉన్నందువల్ల ఈ వివాదంలో అసలు నిజానిజాలు ఏమిటనేవి భవిష్యత్తులో తేలనున్నాయి. 

Tanushree Dutta Files FIR Against Nana Patekar:

Tanushree Dutta Harassment Case: FIR Registered
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs