Advertisement
Google Ads BL

నాని వెంటపడుతున్న మహేష్ డైరెక్టర్


ప్రస్తుతం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పరిస్థితి ఏ దర్శకుడికి రాదేమో అన్నట్టుగా ఉంది వ్యవహారం. పగవాళ్ళకి కూడా వద్దండి ఈ పరిస్థితి అనేలా ఉంది. మహేష్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసినా బ్రేక్ లేని శ్రీకాంత్ అడ్డాల.. మహేష్ తో తీసిన బ్రహ్మోత్సవం సినిమాతో కనబడకుండా పోయాడు. బ్రహ్మోత్సవం సినిమాతో మహేష్ తన తదుపరి సినిమాల్లో బిజీ అయ్యాడు. కానీ శ్రీకాంత్ మాత్రం ఇండస్ట్రీకి కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.

Advertisement
CJ Advs

అయితే ఒక కొత్త కథతో శ్రీకాంత్ అడ్డాలా హీరో శర్వానంద్ ని కలిసాడని.... శర్వానంద్ కి శ్రీకాంత్ చెప్పిన కథ నచ్చిందని.. ప్రస్తుతం హను రాఘవపూడి, సుధీర్ వర్మలతో చేసిన సినిమాలు పూర్తికాగానే శర్వానంద్.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటిస్తాడని ప్రచారం జరిగింది. అయితే తాజాగా శ్రీకాంత్ అడ్డాల కథని శర్వానంద్ హోల్డ్ లో పెట్టేయడంతో..  శర్వానంద్ కోసం వెయిట్ చెయ్యలేక శ్రీకాంత్ అడ్డాల ఆ కథతో కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాల్తో దెబ్బతిన్న నానికి వినిపించినట్లుగా తెలుస్తుంది.

ఇక నానికి కథ నచ్చినా... ప్రస్తుతం ఏ డైరెక్టర్ కి నాని కమిట్ అయ్యే పరిస్థితుల్లో లేడట. ఎందుకంటే జెర్సీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం... బిగ్ బాస్ సీజన్ టు తో చిరాకుతో ఉన్న నాని ఒకేసారి రెండు సినిమాలు చేసే ఓపిక లేదంటున్నాడట. అలాగే ఇప్పటికే వరసగా రెండు సినిమాలు ప్లాప్ అవడంతో ప్లాప్ దర్శకుడితో సినిమా చేస్తే తన క్రేజ్ మరింతగా తగ్గుతుందని నాని భావించి.. శ్రీకాంత్‌కు నో చెప్పేస్తాడనే టాక్ నడుస్తుంది. ఎలాగూ నాని ధైర్యం చేసి ఈ సినిమా చేసే అవకాశం లేదంటున్నారు.. మరి శర్వా, నాని లు కాదన్నా కథ ఏ హీరో దగ్గరికెళుతుందో చూద్దాం.

Mahesh Director Wants Nani:

Srikanth Addala wants Nani for His Script
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs