Advertisement
Google Ads BL

నానా అలాంటివాడు కాదంటున్న వర్మ..!!


వివాదాలకు, వివాద చిత్రాలకు, మాటలు చేతలు అన్నింటిలో 'అంతా నా ఇష్టం' అనే తత్వం ఉన్న దర్శకుడు రాంగోపాల్‌ వర్మ. ఆ మధ్య ఆయన ఓసారి మాట్లాడుతూ, నా ముంబై ఆఫీస్‌లో ఓ బెడ్‌రూం కూడా ఎంజాయ్‌ చేయడానికి ఉంటుందని, హీరోయిన్ల కోసం నేను టైం వృధా చేసుకోను.. ఆ సమయంలో నాకు నచ్చిన వారందరితో సెక్స్‌ చేస్తానని వర్మ చెప్పాడు. ఇక తాజాగా వర్మ దేశాన్ని, ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కాస్టింగ్‌ కౌచ్‌పై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ, సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు అనేవి వాస్తవమే. తనుశ్రీ దత్తాతో పాటు పలువురు నటీమణులు బయటకు వచ్చి ఈ వ్యవహారంపై మాట్లాడటం అభినందనీయం. 

Advertisement
CJ Advs

అయితే తనుశ్రీదత్తా-నానా పాటేకర్‌ల వ్యవహారంలో ఏమి జరిగిందో మాత్రం నాకు తెలియదు. నానా పాటేకర్‌తో చాలా కాలం కలసి పనిచేశాను. ఆయన షార్ట్‌టెంపర్‌ వ్యక్తే. కానీ వ్యక్తిగతంగా ఒకరిని వేధించే మనస్తత్వం నానాకు లేదు. ముంబైకి వెళ్లిన కొత్తలో నానాకి ఫోన్‌ చేశాను. సాధారణంగా ఎవరైనా మనం ఫోన్‌ చేసినప్పుడు హలో అంటాం. ఆయన మాత్రం 'బోల్‌' (చెప్పు) అన్నాడు. సార్‌.. నా పేరు రాంగోపాల్‌ వర్మ. నేను డైరెక్టర్‌ని, హైదరాబాద్‌ నుంచి మిమ్మల్ని కలవాలని వచ్చాను అని చెప్పాను. వెంటనే నానా 'అయితే వెంటనే ఇంటికి వచ్చేయ్‌' అన్నారు. నానా వంటి స్ట్రెయిట్‌ ఫార్వర్డ్‌ వ్యక్తిని చాలా అరుదుగా మాత్రమే చూస్తూ ఉంటాం. నానాని అర్ధం చేసుకుంటే ఎవరైనా ఆయనను ఖచ్చితంగా గౌరవిస్తారు. 

నాకు తెలిసి నానా తన కెరీర్‌లో ఎప్పుడు లైంగిక వేధింపులకు పాల్పడలేదు. పాల్పడడు కూడా. నానా గురించి తెలియని వ్యక్తులు ఆయనను తప్పుగా అర్దం చేసుకుంటున్నారు. నానా అసలు ఆ తరహా వ్యక్తే కాదని వర్మ కితాబునిచ్చాడు. ఇక నానా లైంగిక వేధింపులకు పాల్పడడని, కేవలం తోటి ఆర్టిస్టుల పట్ల దుందుడుకుగా వ్యవహరిస్తాడని, దాంతో అపార్ధం చేసుకోవడం వల్లో, లేక ఆయన చేత తిట్లు, దెబ్బలు తిన్నవారో ఆయనకు ఈ కాస్టింగ్‌కౌచ్‌ విషయంలో ఇరికించారని బీటౌన్‌లోని పలువురు భావిస్తున్నారు. 

Rgv Supports Nana Patekar:

Rgv Reacts Metoo Movement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs