Advertisement
Google Ads BL

సల్మాన్‌ గుట్టు రట్టు చేసిన ఐశ్వర్యరాయ్..!


తనతో నటించే ప్రతి హీరోయిన్‌తో ఎఫైర్లు నడపడం, షష్టిపూర్తి వయసులో కూడా ఎంతో ఫిట్‌గా, గ్లామర్‌గా కనిపించడంతో పాటు ఉమనైజర్‌గా, ప్లేబోయ్‌గా బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కి గుర్తింపు ఉంది. కత్రినా కైఫ్‌, ఐశ్వర్యారాయ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ నుంచి ఆయన లిస్ట్‌లో ఎందరో ఉన్నారు. ఇక ఇప్పటికీ మోస్ట్‌ వాంటెడ్‌ బ్యాచ్‌లర్‌గా పేరు తెచ్చుకున్న సల్మాన్‌భాయ్‌ తెరపై మాత్రం శృంగార సన్నివేశాలలో నటించనని చెబుతాడు. ఆయన చిత్రాలు చూసినా అదే అర్ధమవుతుంది. ఇక మరికొన్ని విషయాలలో కూడా ఆయన మంచివాడే. తీవ్రమైన నరాల వ్యాధి కూడా ఈయనకు ఉంది. అందుకే అప్పుడప్పుడు ఆయన బిహేవియర్‌ వయొలెంట్‌గా ఉంటుందని అంటారు. 

Advertisement
CJ Advs

కృష్ణ జింకల కేసు నుంచి డ్రంక్‌ డ్రవ్‌లో పలువురి మరణాలకు కారణమైన ఈయన మొదట్లో అందాల పుత్తడి బొమ్మ ఐశ్వర్యారాయ్‌తో కూడా ఎఫైర్‌ నడిపాడు. ఆమె విషయంలోనే షారుఖ్‌ఖాన్‌ నుంచి పలువురిపై చేయిచేసుకున్నాడు. నాడు ఐశ్వర్యారాయ్‌ని అమితాబ్‌బచ్చన్‌ ఇంటి కోడలిని చేసుకోవడంపై కూడా ఆ బచ్చన్‌ వంశ అభిమానులు మండిపడ్డారు. ఇక జయాబచ్చన్‌ వంటి వారు తమ కోడలి జోలికి రావద్దని కూడా సల్మాన్‌కి వార్నింగ్‌ ఇచ్చారు. 

ఇక విషయానికి వస్తే.. ఐశ్వర్యాబచ్చన్‌ తాజాగా మాట్లాడుతూ, సినీ రంగంలోని వేధింపులపై నేను మొదటి సారిగా మాట్లాడుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా మహిళలు తమ బాధలను చెప్పుకొనేందుకు.. ఇతరులతో పంచుకునేందుకు సోషల్‌మీడియా ఓ బలమైన సాధనంగా మారింది. లైంగిక వేధింపుల గురించి బయట పెట్టడానికి సమయంతో పనిలేదు. కొంచెం ఆలస్యమైనా ‘మీటూ’ ఉద్యమం దేశవ్యాప్తంగా రావడం ఎంతో సంతోషాన్ని అందిస్తోంది. ఇది ఆహ్వానించదగిన పరిణామం. 

2002లో నేను, సల్మాన్‌ విడిపోయిన తర్వాత కూడా ఆయన నన్ను వేధించడం మానలేదు. ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఏదో చెత్త చెత్త వాగేవాడు. కలిసి ఉన్నప్పుడు కూడా సల్మాన్‌ నన్ను శారీరకంగా కూడా వేధించాడు. శారీరకంగా హింసించేవాడు. నా అదృష్టం ఏమిటంటే.. ఆ గాయాల కారణంగా ఏర్పడిన గాట్లు శరీరంపై ఎలాంటి మచ్చను ఏర్పరచలేదు. సల్మాన్‌నన్ను తీవ్రంగా గాయపరిచినా కూడా తట్టుకుని, ఉదయాన్నే ఏమీ జరగని దానిలా షూటింగ్‌లకి వెళ్లిపోయేదానినని ఆవేదనతో చెప్పుకొచ్చింది. దీన్ని బట్టి సల్లూ భాయ్‌ మనస్తత్వం ఏమిటో అర్ధమవుతోంది...! 

Aishwarya Rai Sensational Comments on Salman Khan:

Aishwarya Rai Supports MeToo
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs