Advertisement
Google Ads BL

‘ఎన్టీఆర్’.. శ్రీదేవి పాత్ర లుక్‌పై సెటైర్లు..!!


బాలకృష్ణ - క్రిష్ కాంబోలో రెండో మూవీ గా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ ని పరిగెత్తిస్తున్నారు. బయోపిక్ ని రెండు భాగాలుగా  తెరకెక్కిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ నటజీవితాన్ని ఎన్టీఆర్ కథానాయకుడిగా.. ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని ఎన్టీఆర్ మహానాయకుడు గా తెరకెక్కిస్తున్నట్లుగా చెప్పారు. ప్రస్తుతం కథానాయకుడు సినిమాకి సంబంధించిన షూటింగ్ తో పాటుగా ఆ పార్ట్ లో నటిస్తున్న కేరెక్టర్స్ ని ఒక్కొక్కటిగా దర్శకుడు క్రిష్ రివీల్ చేస్తూ అందరిలో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పటికే బాలకృష్ణ ఎన్టీఆర్ లుక్, ఏఎన్నార్ గా సుమంత్ లుక్, చంద్రబాబుగా రానా లుక్ ఆకట్టుకున్నాయి.

Advertisement
CJ Advs

ఇక ఎన్టీఆర్ - చంద్రబాబు కాంబో... అంటే బాలయ్య - రానా కాంబో స్టిల్... ఎన్టీఆర్ - ఏఎన్నార్ కాంబో అంటే బాలయ్య - సుమంత్ కాంబో స్టిల్ కూడా వదిలారు. అయితే తాజాగా శ్రీదేవి పాత్రలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ కూడా ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్.. శ్రీదేవి కేరెక్టర్ లో కానీ లుక్ లో కానీ ఏమాత్రం సరిపడలేదనే టాక్ సోషల్ మీడియాలో నడుస్తుంది.  శ్రీ‌దేవిని మరిపించడం ఎవరికైనా క‌ష్ట‌మే. ర‌కుల్ అయితే శ్రీదేవిగా మ‌రీ తేలిపోయిన‌ట్టు క‌నిపించింది. కొంత‌మంది రకుల్ ప్రీత్.. శ్రీదేవి లుక్ పై కౌంట‌ర్లు కూడా వేశారు. మరికొందరైతే రకుల్ ప్రీత్ సింగ్ ఈ లుక్‌లో శ్రీరెడ్డిలా ఉందంటూ సెటైర్లు కూడా పేలుస్తున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన లుక్ పై డిస్కర్షన్స్ జరుగుతుండగానే..  క్రిష్ అండ్ టీం మళ్లీ బాల‌కృష్ణ – ర‌కుల్‌లు క‌లిసి ఉన్న స్టిల్ ఒక‌టి విడుద‌ల చేశారు. ఎన్టీఆర్‌గా బాల‌య్యని ఎక్కడా వంక పెట్ట‌లేనంత బాగా మార్చేశాడు క్రిష్‌. ఇక్కడ కూడా ర‌కుల్ రూప‌మే కాస్త తేడా కొట్టింది. శ్రీ‌దేవిగా ర‌కుల్ మార‌లేక‌పోయింది అంటూ నందమూరి అభిమానులే చెబుతున్నారు.

బాలయ్య - రకుల్ కాంబోలో ఉన్న ఆ స్టిల్ ఆకుచాటు పిందె తడిచే పాటకు సంబంధించింది. ఇక ఆ పాటలో రకుల్ అండ్ బాలయ్య వానలో స్టెప్స్ వేస్తున్నారు. కాకపోతే బాలకృష్ణ బేల్బేటం ఫాంట్ లో ఎన్టీఆర్ ని మరిపించేసాడు. కానీ రకుల్ మాత్రం శ్రీదేవి గా తేలిపోయింది. ఏది ఏమైనా అన్ని కేరెక్టర్స్ లో క్రిష్ తీసుకున్న శ్రమ మాత్రం శ్రీదేవి విషయంలో తేడా కొట్టిందనేది మాత్రం వాస్తవం అంటున్నారు. 

Negative Comments on NTR Biopic Movie Sridevi Look :

Rakul Preet Sing Plays Sridevi role in NTR Biopic
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs