Advertisement
Google Ads BL

స్వీటీ అనుష్క గొప్పతనం గురించి భలే చెప్పాడు


తెలుగు తెరపై బ్యూటీఫుల్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న వారిలో ప్రభాస్‌-అనుష్కలు ముందు వరుసలో ఉంటారు. వీరు ‘బాహుబలి’ ముందు వరకు ‘బిల్లా, మిర్చి’ వంటి చిత్రాల ద్వారా అద్భుతమైన కెమిస్ట్రీ, మంచి హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. అదే ఇక ‘బాహుబలి’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియాలోని ప్రాంతీయ భాషలన్నింటిలోనే కాకుండే బాలీవుడ్‌లో, విదేశాలలో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరి జంట ఎలా ఉండేదంటే వీరిద్దరు కలిసి జీవితంలో వివాహం చేసుకుంటే భలే ఉంటుంది అనిపించేలా వీరికి పేరు వచ్చింది. దాంతో వీరి అభిమానులు, ప్రేక్షకులే కాదు... మీడియాలో సైతం ప్రభాస్‌ స్వీటీ అనుష్కనే వివాహం చేసుకుంటాడనే వార్తలు కూడా ఎంత ఖండించినా వస్తూనే ఉన్నాయి. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే ఇండస్ట్రీలో ప్రభాస్‌ సన్నిహితునిగా, ఏకంగా ప్రభాస్‌ అనే పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న నటుడు ప్రభాస్‌ శ్రీను. తెలుగుతెరపై కామెడీని, కామెడీతో కూడిన విలనిజాన్ని చూపించడంలో ఈయనకంటూ ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాంటి ప్రభాస్‌ శ్రీను తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. స్వీటీ అనుష్క గురించి చెప్పుకొచ్చాడు. గతంలో ఎన్నోసార్లు ప్రభాస్‌ గొప్పతనం గురించి చెప్పిన ఈయన తాజాగా అనుష్క ప్రస్తావన రాగానే..అనుష్క ఎంతో స్టార్‌ హీరోయిన్‌. అయినా ఆమె ఆ స్థాయిని చూపించరు.తనకంటే తక్కువ స్థాయి వారితో కలిసి పోయి ఎంతో గౌరవం ఇస్తారు. ఎంతో చనువుగా ఉంటారు. ఎవ్వరినీ నొప్పించకపోవడం ఆమె ప్రత్యేకత, గొప్పతనం. 

‘భాగమతి’ చిత్రం షూటింగ్‌ ఓ హాస్టల్‌ బిల్డింగ్‌లో రాత్రి వేళ జరిగింది. దసరా సెలవుల కారణంగా తెల్లవారితో ఆ హాస్టల్‌లోని విద్యార్ధులంతా ఎవరికి వారు ఇళ్లకు వెళ్లనున్నారు. వాళ్లందరికీ కావాల్సిన బట్టలు, చాక్లెట్స్‌, బిస్కెట్స్‌, సబ్బులు, పేస్ట్‌లు తెప్పించి ఆ పిల్లలకు అనుష్క గారు పంచిపెట్టారు. పిల్లలంతా ఎంతో ఆనందించి, ఆమె గొప్పమనసుని చూసి ఉప్పొంగిపోయారు. ఆమె మంచితనం చూసి నేనే కాదు.. యూనిట్‌ అందరం ఎంతో ఆశ్చర్యపోయాం. అందుకే మంచితనం అనే మాట వింటే నాకు అనుష్కనే గుర్తుకు వస్తుంది.. అని చెప్పుకొచ్చాడు. 

Prabhas Srinu About Anushka Greatness:

Prabhas Srinu Talks About Sweety Anushka Shetty
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs