Advertisement
Google Ads BL

మాజీ ప్రియుడు.. హీరోయిన్‌ని ఇలా కొట్టాడేంటి?!


ఫ్లోరాసైనీ.. ఈపేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండవచ్చు గానీ ఆశాసైనీ అనిచెబితే మాత్రం బాలీవుడ్‌ నుంచి దక్షిణాది సినీ ప్రేమికుందరికీ తెలుసు. ఈమె దక్షిణాదిలో రజనీకాంత్‌, విజయ్‌కాంత్‌, ప్రభు, కార్తీక్‌, బాలకృష్ణ, వెంకటేష్‌, జగపతిబాబు, రాజశేఖర్‌ వంటి హీరోలందరితో కలిసి నటించింది. ‘ప్రేమకోసం, అంతా మనమంచికే, అమ్మో ఒకటోతారీఖు’తో పాటు ‘మనసున్న మారాజు, అక్కా బావెక్కడ, నవ్వుతూ బతకాలిరా, నరసింహనాయుడు, ప్రేమతోరా.., నువ్వు నాకు నచ్చావ్’ వంటి పలు చిత్రాలలో నటించింది. 

Advertisement
CJ Advs

ఈమె తాజాగా మాట్లాడుతూ, నా మాజీ ప్రియుడు, నిర్మాత గౌరంగ్‌ నా పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. నాపై చేయిచేసుకున్నాడు. అది నేనే. 2007 ప్రేమికుల దినోత్సవం. ఆరోజు గౌరంగ్‌జోషి నన్ను విపరీతంగా కొట్డాడు. ఏడాది పాటు నాకు నరకం చూపించాడు. దాని ఫలితంగా నా మొహంపై చెరిగిపోని గాట్లు పడ్డాయి. ఆసమయంలో జరిగిన విషయాలను నేను బయటపెట్టాను. కానీ నన్ను నాడు నమ్మేవారు ఎవ్వరూ లేరు. ఎందుకంటే గౌరంగ్‌కి నాడు ఎంతో పలుకుబడి ఉండేది. నాకు సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని పలుసార్లు బెదిరించేవాడు. కొన్నిసందర్భాలల్లో నన్ను సినిమాలలోకి తీసుకున్నట్లే తీసుకుని, ఆ తర్వాత తీసేసేవారు. నన్ను ఆడిషన్స్‌కి కూడా పిలవడానికి భయపడేవారు. ఆక్షణాన నేను నోరు తెరవకుండా ఉండాలని అనిపించింది. 

కేవలం నా ప్రతిభను చూసి మాత్రమే అవకాశాలు ఇచ్చేవారు ఎవరైనా ఉంటే వారి వద్దకు పారిపోయి తలదాచుకోవాలని భావించాను. నేనే కాదు...నాలాంటి మహిళలు ఎందరో గౌరంగ్‌ వల్ల ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. వారంతా నాకు ఫోన్లు చేసి సాయం చేయమని అడిగారు. కానీ నేను ఆధైర్యం చేయలేకపోయాను. తమ పట్ల జరుగుతున్న దారుణాలను గురించి బయటపెడుతున్న వారి కోసం నేను ఈ పోస్ట్‌ పెడుతున్నాను. మీరే సూపర్‌హీరోస్‌. మీలాంటి వారు సమాజానికి ఎంతో అవసరం. 

గౌరంగ్‌ వల్ల నా జీవితంలో ఎంతో కోల్పోయాను. ఆఘటన తర్వాత నా జీవితంలో నేను బాగుచేయలేని మార్పులు చోటుచేసుకున్నాయి. కానీ ఆ దేవుడి ముందుఎవ్వరూ ఎక్కువ కాదని నమ్మే వ్యక్తిని నేను. నిజాన్నినమ్ముకోండి.. దానిని ఆయుధంలా ధరించండి. మళ్లీ మనమంతా సంతోషంగా ఉండాలి. ఇలాంటి వారి నుంచి మనల్ని మనం కాపాడుకుందాం...! అని చెబుతూ,గౌరంగ్‌ తన మొహంపై పెట్టిన గాట్లు, గాయాలకు సంబంధించిన ఫొటోలను ఫ్లోరాసైనీ పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఇవి వైరల్‌ అవుతున్నాయి. 

Actress Flora Saini Alleges Producer Gaurang Doshi:

Flora Saini accuses producer and ex Gaurang Doshi of physical abuse
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs