Advertisement
Google Ads BL

ఆ గిఫ్ట్ చూసిన ఎన్టీఆర్ హ్యాపీని వర్ణించలేనంటోంది!


తండ్రి హరికృష్ణ అంటే యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌కి ఎంత ఇష్టమో తెలిసిందే. తండ్రే ఆయన ప్రాణం. ‘అరవిందసమేత వీరరాఘవ’ వేడుకలో, ప్రమోషన్స్‌లో కూడా తారక్‌ తనకి తండ్రి హరికృష్ణ అంటే ఎంత ప్రాణమో చెబుతూనే ఉన్నాడు. ఇక విషయానికి వస్తే ‘అరవింద సమేత వీరరాఘవ’ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రముఖ యాంకర్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గాయత్రి భార్గవి ఎన్టీఆర్‌ని ఇంటర్వ్యూ చేస్తూ తారక్‌కి ఆమె అత్యంత విలువైన బహుమతిని అందించింది. 

Advertisement
CJ Advs

ఆమె తాత శంకర్‌ నారాయణ్‌ గీసిన నందమూరి హరికృష్ణ పెన్సిల్‌ స్కెచ్‌ని జూనియర్‌కి కానుకగా ఇచ్చింది. ఈ విషయాన్ని గాయత్రి భార్గవి ట్వీట్‌ ద్వారా తెలిపింది. మా తాతగారైన శంకర్‌ నారాయణ గీసిన హరికృష్ణ గారి పెన్సిల్‌ స్కెచ్‌ని తారక్‌గారికి కానుకగా ఇచ్చాను. దీనిని అందుకున్న ఎన్టీఆర్‌గారి మొహంలో కనిపించిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. ఆయన కళ్లలోని ఆ అనుభూతిని వర్ణించలేను. ఈ పెన్సిల్‌ స్కెచ్‌ని అందుకున్న ఎన్టీఆర్‌ ‘దీనిని అమ్మకు ఇస్తాను.. థ్యాంక్యూ వెరీ మచ్‌’ అన్నారని ఆమె తెలిపింది. 

నిజమే కోట్లాది రూపాయల విలువైన బహుమతుల కన్నా ఇలాంటివే ‘నాన్నకు ప్రేమతో’ అనేలా జీవితాంతం మనసులో జ్ఞాపకంగా ఉండిపోతాయి.

Anchor and Artist Gayatri Bhargavi Gift to Jr NTR:

NTR Happy with Harikrishna Pencil Sketch
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs