Advertisement
Google Ads BL

ప్రధానమంత్రికి బాడీగార్డ్‌గా స్టార్ హీరో..?


ప్రస్తుతం స్టార్‌ హీరో సూర్య పెద్దగా ఫామ్‌లో లేడు. ఆయన నటించిన చిత్రాలు పెద్దగా విజయం సాధించడం లేదు. ఇటీవలే రమ్యకృష్ణతో కలిసి ‘గ్యాంగ్‌’ చిత్రంలో నటించినా అనుకున్న ఫలితాన్నిఇవ్వలేదు. ప్రస్తుతం ఆయన సెల్వరాఘవన్‌ అలియాస్‌ శ్రీరాఘవతో పనిచేస్తున్నాడు. శ్రీరాఘవ.. ‘7బైజి బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, వర్ణ’ వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఇక సూర్య.. సెల్వరాఘవన్‌తో ‘ఎన్జీకే’ సినిమాలో నటిస్తూనే మరోవైపు విభిన్నచిత్రాల దర్శకుడు కెవి ఆనంద్‌ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నాడు. ఇది సూర్య37వ చిత్రం. 

Advertisement
CJ Advs

ఈ చిత్రం సెట్‌లో తీసిన కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అవుతున్నాయి.ఈ చిత్రంలో మలయాళ స్టార్‌, తమిళ, తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు.. బాలీవుడ్‌లో కూడా పేరున్న గొప్పనటుడు మోహన్‌లాల్‌ కీలకపాత్రను పోషిస్తున్నాడు. ఇక ఈ ఫొటోలు వైరల్‌ కావడానికి కారణం ఇందులో మోహన్‌లాల్‌ ప్రధాని మోదీలా కనిపిస్తూ పీఎంగా నటిస్తున్నాడని వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది. త్వరలో బిజెపిలో మోహన్‌లాల్‌ చేరుతాడనే వార్తల నేపధ్యంలో ఆయన మోదీ వేషధారణ, గెటప్‌లో కనిపించడం మరింత ఆసక్తిని రేపుతోంది.

ఫొటోలను బట్టి చూస్తే ఇందులో సూర్య ప్రధాని మోహన్‌లాల్‌కి బాడీగార్డ్‌లా నటిస్తున్నాడనే విషయం తెలుస్తోంది. ఇక అల్లుశిరీష్‌ చేయాల్సిన పాత్రను ప్రస్తుతం తమిళ యంగ్‌స్టార్‌ ఆర్య చేస్తుండటం విశేషం. మరి ఈ రెండు చిత్రాలు సూర్యకి మంచి హిట్స్‌ని అందిస్తాయా? సూర్యకి మోహన్‌లాల్‌, ఆర్యలు ఎంత వరకు సపోర్ట్‌ చేస్తారు? అనేవి వేచిచూడాల్సిన విషయాలు. 

Hero Suriya Bodyguard to Prime Minister:

Suriya and Mohanlal in KV Anand Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs