Advertisement
Google Ads BL

అసలు ‘అరవింద’ గురించి వార్తలేవి..?


ఎన్టీఆర్ - త్రివిక్రమ్ లు అరవింద సమేత గురించిన ఇంటర్వ్యూస్ తో సినిమా మీద అంచనాలు పెంచేస్తుంటే.. ఈ సినిమా లో లీడింగ్ రోల్ అంటే అరవింద సమేత టైటిల్ రోల్ పోషించిన పూజాహెగ్డే మాత్రం ప్రమోషన్స్ కి దూరంగా ఉంటుంది. పూజ హెగ్డే కున్న బిజీ షెడ్యూల్స్ వల్ల అరవింద సమేత ప్రమోషన్ లో పాల్గొనలేకపోతుంది అన్నది తెలిసిన విషయమే. మరి ఎన్టీఆర్ ఎప్పటిలాగే ప్రమోషన్స్ లో జోరు చూపిస్తుంటే.. త్రివిక్రమ్ ఎన్నడూ లేనిది ఒక సినిమా ప్రమోషన్స్ తో ఎన్టీఆర్ తో పాటు పాల్గొంటూ సోలో ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నాడు. కానీ ప్రమోషన్స్ లో అరవింద మిస్సింగ్ మాత్రం పూడ్చలేని లోటుగానే కనబడుతుంది.

Advertisement
CJ Advs

ఎందుకంటే.. సెన్సార్ టాక్ లోను అందరూ ఎన్టీఆర్ నటన ఆహా ఓహో..... త్రివిక్రమ్ సూపర్, జగపతి బాబు విలన్ గా అదుర్స్, సునీల్ నీలాంబరి గా కామెడీ ఎమోషన్స్ పండించాడు అంటూ న్యూస్ లు మీడియాలో, సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో, ప్రింట్ మీడియాలో ప్రసారం అవుతున్నాయి. కానీ ఎక్కడా అరవింద గా చేసిన పూజ హెగ్డే నటన, ఆమె అందం, ఆమె డాన్స్ ల లాంటివేమీ వినిపిస్తే ఒట్టు. ప్రస్తుతం ప్లాప్స్ లో ఉన్న పూజ హెగ్డే అరవింద సమేత మీద భారీ ఆశలే పెట్టుకుంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ని తన చుట్టూ తిప్పుకునే కేరెక్టర్ లో నటించిన పూజ గ్లామర్ పరంగా చాల బావుంది అనేలా రెడ్డి ఇక్కడ చూడు సాంగ్ లో కనబడుతుంది.

రెడ్డి ఇక్కడ చూడు సాంగ్ లో ఎన్టీఆర్ తో పోటీగా స్టెప్స్ లో ఇరగదీసింది పూజ హెగ్డే. అంతేకాకుండా గ్లామర్ షో పరంగాను పూజ అద్భుతం అనేలా కనబడుతుంది. కాకపోతే మరీ సన్నగా అసలు ఒంట్లో కండ ఉందా లేదా అన్నట్టుగా ఉన్న పూజ హెగ్డే.. ఎన్టీఆర్  పక్కన హుషారుగా స్టెప్స్ వేయడంలో బాగానే పోటీ పడినట్టు ఉంది. మరి ఈ సినిమా లో అనగనగా అనే పాటలోను, రెడ్డి ఇక్కడ చూడు పాటలోను  పూజ హెగ్డే ని చూసిన ఎవరైనా.. అరవింద సమేతలో అరవింద కూడా అద్భుతమేనండి అంటారు. ఇక పూజా హెగ్డే నటన గురించి, ఆమె అందం గురించి పొగడాలి అంటే కొన్ని గంటలు వెయిట్ చెయ్యాలి.

Pooja Hegde Beautiful in Reddy Ikkada soodu Song:

Pooja Hegde Not Highlight at Aravinda Promotions
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs