Advertisement
Google Ads BL

సమంత..‘మీటూ’ అంటూ ముందుకొచ్చింది


టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రస్తుతం క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించిన వార్తలు మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. తెలుగులో శ్రీ రెడ్డి క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి పోరాడినప్పటికీ.. మధ్యలో సంబంధం లేని వ్యక్తులను కెలుక్కుని కామ్ అయ్యింది. ఇక తాజాగా బాలీవుడ్ లో తనుశ్రీ దత్తా చేస్తున్న క్యాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలకు.. చాలామంది హీరోయిన్స్ కూడా మద్దతు తెలుపుతున్నారు. తమకి జరిగిన అన్యాయాన్ని జరిగినప్పుడు బయటపెట్టలేని వారు తనుశ్రీ క్యాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలపై గళమెత్తగానే ఒక్కొక్కరిగా బయటికొస్తున్నారు. తాజాగా బాలీవుడ్ లో కంగనా రనౌత్ కూడా ఈ క్యాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలు చేస్తుంది. ఇక నిన్నగాక మొన్న కంగనా క్యాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలపై సోనమ్ కపూర్ స్పందన వారిద్దరి మధ్యన వివాదానికి దారితీసింది.

Advertisement
CJ Advs

ప్రస్తుతం తనుశ్రీ దత్తా - నానాపాటేకర్ మధ్యన జరుగుతున్న ఈ యుద్ధంలో చాలామంది పెద్దలు తనుశ్రీ వైపు నిలబడుతున్నారు. మరోపక్క కోలీవుడ్ కం టాలీవుడ్ సింగర్ చిన్మయి కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ పై తన గళాన్ని వినిపించింది. కేసులు, ప్రతి కేసులతో బాలీవుడ్ లో హాట్ హాట్గా జరుగుతున్నా చర్చలకు టాలీవుడ్ నుండి కూడా మద్దతు మొదలైంది. తనుశ్రీ చేస్తున్న ‘మీటూ’ మూమెంట్‌కి మద్దతు పలుకుతున్నవారిలో చాలామంది పెద్ద హీరోయిన్స్ ఉండడం గమనార్హం. తాజాగా ఈ ‘మీటూ’ మూమెంట్‌కి తన మద్దతు తెలియజేసింది టాలీవుడ్ హాట్ అండ్ టాప్ హీరోయిన్ సమంత.

‘మీటూ’ పై సమంత స్పందన ఏమిటంటే... చాలా అంటే చాలా సంతోషంగా వుంది… మహిళలు ధైర్యాన్ని కూడదీసుకుని తాము ఎదుర్కొన్న ఘటనల గురించి, లైంగిక వేధింపుల గురించి చెప్తున్నారు. వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకుని తీరాలి. కొంతమంది వ్యక్తులు, కొందరు మహిళలు కూడా మీటూ గురించి మాట్లాడుతున్న మహిళలను నిలదీస్తున్నారు. ఆధారాలు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. ఇది సిగ్గుచేటు. ‘మీటూ’ గురించి మాట్లాడుతున్న మహిళలు తాము ఎంతోమంది చిన్నారుల జీవితాలను కాపాడుతున్నారని తెలుసుకోండి. ‘మీటూఇండియా’కి నేను మద్దతు ఇస్తున్నా.. అంటూ సమంత మొదటగా ఈ మీటూ కి మద్దతు పలికింది. 

మరి కేవలం సమంతనే కాదు.. మిగతా టాప్ రేంజ్ హీరోయిన్స్ కూడా ఇలాంటి వాటికి మద్దతు పలకడం చాలా అవసరం. ఎందుకంటే చాలామంది చిన్న పెద్ద హీరోయిన్స్‌లో ఈ క్యాస్టింగ్ కౌచ్ కి బలైనవారు ఉన్నారు.

Samantha Supports MeToo movement:

Samantha Tweet on&nbsp;<span>MeToo movement</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs