Advertisement
Google Ads BL

వీరరాఘవుడి గురించి మరో వార్త..!!


ఇంకొన్ని గంటల్లో ఎన్టీఆర్ - త్రివిక్రమ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో రాబోతోన్న మూవీ థియేటర్స్ లో సందడి చేయనుంది. ‘అరవింద సమేత’ బెనిఫిట్ షోకు ముహూర్తం తెల్లవారుఝామున 4.50 నిమిషాలకు పెట్టారు. ఇక తెలంగాణాలో ఉదయం 6 నుంచి రెగ్యులర్ షోలు స్టార్ట్ కానున్నాయి. ఆంధ్రలో టికెట్ రేట్స్ రిలీజ్ రోజు నుండి వారం రోజులు పాటు పెంచుకునే వెసులుబాటు కలిపించింది ఏపీ ప్రభుత్వం. తెలంగాణాలో సాధారణ రేట్లకే టికెట్స్ అమ్ముతారని తెలుస్తుంది.

Advertisement
CJ Advs

అయితే ఈ సినిమా స్టోరీ ఏమై ఉంటుందని గత కొన్ని రోజులు నుండి సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం మనకి ట్రైలర్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సినిమా స్టార్టింగ్ లోనే వస్తుందని సమాచారం. జగపతిబాబు ఎన్టీఆర్ ఫ్యామిలీపై దాడి చేయిస్తాడని..ఆ క్రమంలో ఎన్టీఆర్ తండ్రి నాగబాబు చనిపోవడంతో స్పాట్ లోనే దానికి ప్రతిగా తారక్ అతన్ని చంపేస్తాడని చెబుతున్నారు. దాంతో ఇక హింస ఉండదని భావించి చదువుల కోసం తారక్ కాలేజీ వెళ్ళిపోతాడు. కొన్ని కారణాలు వల్ల అరవింద కోసం గ్రామానికి రావాల్సి వస్తుంది. తీరా చూస్తే జగపతిబాబు బతికే ఉంటాడు. దాంతో ఎన్టీఆర్ మళ్లీ ఫ్యాక్షనిజం వైపు అడుగులు వేసి జగపతిబాబు చంపేస్తాడా? లేదా మాటలతో మారుస్తాడా? అనేది మిగిలిన కథ అంటున్నారు.

సెకండాఫ్ కొన్ని బరువైన సీన్లు ఉన్నాయట. అవి త్రివిక్రమ్ బాగా డీల్ చేసాడని..తన మాటలతో ప్రేక్షకులు అందరు కంటతడి పెట్టడం ఖాయమంటున్నారు. ఇందులో యాక్షన్ సీన్స్ ఉంటాయి కానీ అవి ‘సింహాద్రి, ఆది’ రేంజ్ లో ఉండవని..త్రివిక్రమ్ మార్క్ యాక్షన్ ఉంటుందని తెలిసింది. పూజా హెగ్డే తో కేవలం రెండు పాటలే అని తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల అవుతున్న ఈసినిమా ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్ లో ఉంటాయని చెబుతున్నారు.

One More Story on Aravinda Sametha:

Rumours on Aravinda Sametha Movie Story
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs