Advertisement
Google Ads BL

ఆ సినిమాలో హీరోగా ట్రై చేశా.. కానీ!: కౌశల్


పుట్టామా.. బతికామా..మరణించామా? అనేదే జీవితంకాదు.. బతికినంతలో జీవితంలోమనమంటూ ఏమిసాధించాం? చరిత్రలో మనకంటూ ఓ పేజీని కేటాయించుకునేలా ఏమి చేశాం? సమాజం గుర్తుండిపోయేలా కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య, పిల్లలకు మనం అంటూ ఆస్థులు ఇవ్వకపోయినా ఎలాంటి గుర్తింపును, స్ఫూర్తిని రగిలించాం? అనేది ముఖ్యం. ఓ సినిమాలో చెప్పినట్లు లేచామా?తిన్నామా? పడుకున్నామా? తెల్లారిందా? అనేది జీవితం కాదు. అందుకే శ్రీశ్రీ సైతం ‘మనది ఒక బతుకేనా? మనం బతుకుతుంది కూడా ఓ బతుకేనా?’ అంటూ మన జీవితాలను కుక్కలు, పందులతో పోల్చాడు. ఇది అక్షరసత్యం. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే బిగ్‌బాస్‌ సీజన్‌2 ద్వారా చరిత్ర సృష్టించి, త్వరలో గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించనున్న కౌశల్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తల్లి చెప్పిన వాక్యాలను గుర్తు చేసుకున్నాడు. మా అమ్మగారికి నేనంటే చాలా ఇష్టం. జీవితం అంటే పుట్టడం. ఎంజాయ్‌ చేయడం, చనిపోవడం కాదు. జీవితం అంటే ఏదో ఒకటి సాధించడం అని నిరంతరం నాకు చెబుతూ ఉండేది. చనిపోయిన తర్వాత మన గురించి పది మంది గొప్పగా చెప్పుకోవాలని చెబుతూ ఉండేది. ఆ మాటలనే నేను అనుసరిస్తూ వస్తున్నాను. ఇక నటునిగా నా సినీ రంగ ప్రవేశం గురించి చెప్పాలంటే.. మొదటి నుంచి కూడా నేను మోడలింగ్‌పై దృష్టి పెడుతూ వచ్చాను. అ

లా మోడలింగ్‌పై అడుగులు వేస్తున్న సమయంలోనే దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అల్లుఅరవింద్‌లు ‘పరదేశి’ చిత్రానికి అవసరమైన హీరోహీరోయిన్ల కోసం ఒక రియాల్టీషో పెట్టారు. అప్పుడు లక్ష అప్లికేషన్స్‌ వస్తే పది మంది అబ్బాయిలను.. పది మంది అమ్మాయిలను ఎంపిక చేశారు. ఆ పది మంది అబ్బాయిలలో నేను ఒకడిని. నాతో పాటు శివాజీ, లయ, ప్రత్యూష కూడా ఉన్నారు. ఆ సినిమాలో నేను సెలక్ట్‌ కాకపోయినా ఆ తర్వాత ‘రాజకుమారుడు’ చిత్రంలో మహేష్‌బాబుకి స్నేహితుని పాత్రను పోషించాను. అలా నటునిగా నా కెరీర్‌ మొదలైంది.. అని కౌశల్‌ చెప్పుకొచ్చాడు. 

Kaushal Selected for Raghavendra Rao Movie.. But?:

Bigg Boss Winner Kaushal about his film Carrier
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs