Advertisement
Google Ads BL

త్రివిక్రమ్ కూడా అతీతుడు కాదు.. అర్ధమైందా?


సినిమాకి ప్రొమోషన్స్ ఎంత అవసరమో ఈమధ్య రిలీజ్ అయ్యే సినిమాలను బట్టి చెప్పొచ్చు. ఒకప్పుడు చాలా మంది హీరోస్, హీరోయిన్స్, డైరెక్టర్స్ సినిమా రిలీజ్ టైములో ప్రొమోషన్స్ చేసేవారు కాదు. కానీ గత కొంత కాలం నుండి చాలామంది హీరోలు బయటికి వచ్చి తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. తెలుగు సినిమా స్థాయి ప్రపంచ వ్యాప్తంగా తెలియాలనే ఇలా ముందుకు వస్తున్నారేమో మరి.

Advertisement
CJ Advs

తన సినిమాలు రిలీజ్ అవుతుంటే అస్సలు బయట కనిపించని త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం ఇప్పుడు మీడియా ముందుకు వచ్చేశాడు. ఈనెల 11న వరల్డ్ వైడ్‌గా అతను దర్శకత్వం వహించిన ‘అరవింద సమేత’ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రొమోషన్స్‌లో ఎన్టీఆర్‌తో పాటు త్రివిక్రమ్ కూడా టీవీ ప్రొమోషన్స్ చేస్తున్నారు. తెలుగులో ఉండే అన్ని న్యూస్ చానెల్స్ కి చాలా ఓపికగా ఇంటర్వూస్ ఇస్తున్నారు ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్. యాంకర్స్ అడిగే ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానం ఇస్తున్నారు.

త్రివిక్రమ్ గత సినిమా ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఇంటర్వ్యూలు ఫేస్ చేయడం కొంచెం ఇబ్బందే. ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రతి చోట ఆయనను ఈ సినిమా గురించి అడుగుతూనే ఉన్నారు. అయినా కూడా దానికి సింపుల్ గా ఒకట్రెండు ముక్కల్లో ఆన్సర్ చెప్పి ‘అరవింద సమేత’ మీదికి వెళ్లిపోతున్నాడు. 

ఎన్టీఆర్ కూడా ఈ ప్రశ్న వచ్చినపుడల్లా కలగజేసుకుని.. హిట్లు ఫ్లాపులు ఎవరికైనా సహజమని.. తాను కూడా చేదు అనుభవాలు చాలానే ఎదుర్కొన్నానని ఒక సినిమా ఫలితం బట్టి ఇంకో సినిమాను జడ్జ్ చేయకూడదు అని త్రివిక్రమ్ కు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఎప్పుడూ ఇంతలా ప్రమోట్ చేయని త్రివిక్రమ్ ఒకేసారి ఇలా తన సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో అంతరార్థం ఏమై ఉంటుందో.

Big Change in director Trivikram Srinivas:

Trivikram Srinivas Promotes Aravinda Sametha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs