Advertisement
Google Ads BL

ఇలియానా.. ఈసారి గట్టి అవకాశం పట్టేట్లే ఉంది!


 

Advertisement
CJ Advs

ఒకప్పుడు సౌత్‌లో నెంబర్ వన్ హీరోయిన్ ఇలియానా. దాదాపుగా స్టార్ హీరోలందరి సరసన నటించింది. కానీ బాలీవుడ్ బాలీవుడ్ అంటూ ఏళ్ల తరబడి వెయిట్ చేసి మళ్ళీ సౌత్ కి వచ్చేసింది. ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ తో చక్కర్లు కొడుతూనే సౌత్ లో అంటే టాలీవుడ్ లో మళ్ళీ సినిమాలు చేస్తూ బిజీ అవుతోంది. ఇప్పటికే రవితేజ - శ్రీను వైట్ల కాంబోలో అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటిస్తున్న ఇలియానా ఈ సినిమాతోనే సౌత్‌లో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా అయ్యే లోపు మళ్ళీ ఇలియానాకు మరిన్ని టాలీవుడ్ అవకాశాలొస్తాయనే ప్రచారం జరుగుతుంది. 

అయితే ఈలోపే మరో స్టార్ హీరో సరసన ఇలియానాకి ఓ ఆఫర్ వచ్చేట్లుగా ఉందంటూ ఫిలింనగర్ టాక్. పోకిరి సినిమాతో జోడి కట్టి ఇండస్ట్రీ హిట్ అందించిన మహేష్ తో మరోమారు ఇలియానా జోడి కట్టబోతుందనే న్యూస్ వినబడుతుంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన పోకిరి సినిమాలో మహేష్ సరసన యోగా టీచర్ గెటప్‌లో ఇలియానా నడుం ఒంపులతో దర్శక నిర్మాతలను పడేసింది. పోకిరి హిట్ తో స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు దక్కించుకున్న ఇలియానా కెరీర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కేసింది.

ఇక అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతున్న ఇలియానా సుకుమార్ దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కబోతున్న మహేష్ 26 సినిమా కోసం ఇలియానా పేరు హీరోయిన్స్ లిస్ట్ లో పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మళ్లీ మహేష్ - ఇలియానా జోడి మ్యాజిక్ చెయ్యబోతుందనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే మహేష్ 26 వ మూవీ ఇలియానా పేరు ఫైనల్ లిస్ట్ లో ఉంటుందో లేదో.. అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

Ileana got One more big Chance in Tollywood:

Ileana in Mahesh Babu and Sukumar Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs