Advertisement
Google Ads BL

వీరరాఘవుడి కోసం ఈ మెగా హీరో వెయిటింగ్!


బన్నీ తన కెరీర్‌లో ఎప్పుడు లేనంత గ్యాప్‌ని పాటిస్తున్నాడు. సినిమాలలో గ్యాప్‌ వచ్చినా ఆయన తదుపరి చేయబోయే చిత్రంఏమిటి? అనేదానిపై క్లారిటీ వచ్చేది. కానీ ఈసారి దీని విషయంలో కూడా బాగా సస్పెన్స్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తున్నాడు. ‘డీజే’ చిత్రం కమర్షియల్‌గా పెద్దహిట్‌ అని చెప్పినా నిజానికి దాని ఫలితం అల్లుఅర్జున్‌కి సంతృప్తి కలిగించలేదనే వాదనకూడా ఉంది. ఇక ఎంతో నమ్మి సుకుమార్‌ తర్వాత మరోకొత్త దర్శకునిగా చాన్స్‌ ఇచ్చాడు. స్టార్‌రైటర్‌గా పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీని ఎన్టీఆర్‌ కంటే ఎక్కువగా నమ్మి ‘నాపేరు సూర్య... నా ఇల్లు ఇండియా’ చేశాడు.ఇది కూడా ఆకట్టుకోలేకపోయింది. ఇక తెలుగు, తమిళంలో ఓ చిత్రం చేయాలని, తమిళంలోకి కూడా డైరెక్ట్‌ ఎంట్రీని లింగుస్వామి లేదా విక్రమ్‌ కె.కుమార్‌లతో చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ లింగుస్వామి ఫామ్‌లో లేకపోవడం, విక్రమ్‌ కె.కుమార్‌ ‘24, హలో’ ఆశించిన కమర్షియల్‌ హిట్స్‌ని అందించకపోవడంతో మనసు మార్చుకున్నాడని తెలుస్తోంది. 

Advertisement
CJ Advs

ఇక దిల్‌రాజుతో ‘96’ రీమేక్‌లో నటిస్తాడని కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ప్రస్తుతం తనకు వెంటనే ఓ భారీ విజయం అవసరమని భావించిన ఆయన త్రివిక్రమ్‌తో చిత్రం చేయడానికే ఆసక్తి చూపుతున్నాడట. త్రివిక్రమ్‌ ‘అజ్ఞాతవాసి’ దారుణ పరాజయం నేపధ్యంలో ఎన్నడు ఎదుర్కోని విమర్శలు ఎదుర్కొన్నాడు. దాంతో త్రివిక్రమ్‌ ఎన్టీఆర్‌తో చేస్తున్న ‘అరవింద సమేత వీరరాఘవ’పై ఆయన దృష్టి సారించాడు. మరోవైపు త్రివిక్రమ్‌ మొదటి సారిగా వెంకటేష్‌ హీరోగా హారిక అండ్‌ హాసిని బేనర్‌లోనే ఓ చిత్రం చేయాలని భావించాడు. కానీ వెంకీ ప్రస్తుతం ‘ఎఫ్‌2’ తర్వాత నాగచైతన్యతో కలిసి బాబీ దర్శకత్వంలో ‘వెంకీ మామ’ ముందుగా చేసి ఆ తర్వాత త్రివిక్రమ్‌ చిత్రం చేయాలని భావిస్తున్నాడట. 

దాంతో ఆల్‌రెడీ బన్నీ కోసం పుల్‌ స్క్రిప్ట్‌ రెడీ చేసిన త్రివిక్రమ్‌ బన్నీకి కూడా చెప్పి ఓకే చేయించుకున్నాడట. ప్రస్తుతం బన్నీ ‘అరవింద సమేత వీరరాఘవ’ విడుదల కోసం వెయిట్‌ చేస్తున్నాడు. ఈ చిత్రం కనుక హిట్‌ అయితే త్రివిక్రమ్‌ -బన్నీల కాంబినేషన్‌లో ‘జులాయి. సన్నాఫ్‌ సత్యమూర్తి’ తర్వాత హ్యాట్రిక్‌ మూవీ ప్రారంభం కావడం ఖాయమని తెలుస్తోంది. అయితే ముందుగా వీరరాఘవుడు వచ్చి మెప్పిస్తేనే ఈ చిత్రం ఖరారయ్యే అవకాశం ఉంది. 

Mega Hero waiting for NTR Film Aravinda Sametha :

Allu Arjun Movie with Trivikram Srinivas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs