Advertisement
Google Ads BL

‘ఎన్టీఆర్’.. ఇప్పుడిక శ్రీదేవి వంతు..!!


ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో ఒక ఊపు ఊపిన అందాల తార శ్రీదేవి కాలం చేసి కొన్ని నెలలు గడుస్తున్నాయి. అయితే శ్రీదేవి చనిపోయినా.. ఆమె ముచ్చట్లు మాత్రం ఇంకా టాలీవుడ్ సర్కిల్స్ లో వినబడుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ బయోపిక్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడులో రకుల్ ప్రీత్..  శ్రీదేవి గా నటించబోతుంది. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా షూటింగ్ పరిగెడుతుంది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ సినిమా మీద ఎన్ని అంచనాలున్నాయో ఆ సినిమాలో నటిస్తున్న నటుల పాత్రలపై అంతే అంచనాలున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ గా బాలకృష్ణ లుక్, చంద్రబాబుగా రానా లుక్, ఏఎన్నార్ గా సుమంత్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు ఆ సినిమాలో శ్రీదేవి గా నటిస్తున్న రకుల్ ప్రీత్ వంతు. ప్రస్తుతం చేతిలో టాలీవుడ్ అవకాశాలు లేని ఈ భామ ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్రతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక రకుల్ ప్రీత్ అందం, ఆమె చీర కట్టు.. అన్నీ శ్రీదేవి పోలికలతో ఉండడంతో దర్శకుడు క్రిష్ ఆమెని ఎన్టీఆర్ బయోపిక్ కోసం శ్రీదేవి పాత్రకి సెలెక్ట్ చేశాడు. అయితే శ్రీదేవి పాత్రలో నటించడం ఒక ఛాలెంజ్ అంటుంది రకుల్. ఎన్టీఆర్ తో శ్రీదేవి మనవరాలిగాను, హీరోయిన్ గాను నటించిన రికార్డు సృష్టించింది. ఒక సినిమాలో ఎన్టీఆర్ కి మనవరాలుగా చేసిన శ్రీదేవి.. మళ్ళీ 14 ఏళ్లకే ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా జోడి కట్టడం అప్పట్లో పెద్ద సెన్సేషన్.

మరి ఎన్టీఆర్ తో హీరోయిన్స్ గా నటించిన భామ లెవ్వరితోనూ.. హీరో బాలకృష్ణ నటించలేదు. ఎన్టీఆర్ తో పనిచేసిన హీరోయిన్స్ తో బాలకృష్ణ నటించకపోవడానికి వాళ్ళమీద ఉన్న గౌరవమే అంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పాత్ర చేస్తున్న బాలకృష్ణ సరసన రకుల్ ప్రీత్.. శ్రీదేవి గా యాక్ట్ చేయనుంది. ప్రస్తుతం శ్రీదేవి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడానికి శ్రీదేవి స్టయిల్, అండ్ మేనరిజం అన్ని నేర్చుకుంటుందట రకుల్. ఎప్పుడూ శ్రీదేవిని సినిమాల్లోనూ, ఏదైనా అవార్డుల ఫంక్షన్స్ లో టివి లో చూడడం తప్ప రకుల్ ప్రత్యక్షంగా చూడలేదట. అందుకే శ్రీదేవి రోల్ చెయ్యడానికి శ్రీదేవిలా మారడానికి ఆమె అన్ని నేర్చుకుంటుందట.

Sridevi Look From NTR.. Releasing soon:

NTR Biopic. Sridevi Time Starts
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs