Advertisement
Google Ads BL

వాస్తవానికి అసలు విజేత కౌశల్ కాదంట..!


మన సమాజంలో ఎదుటివారి విజయాలను సహృదయంతో, స్పోర్టివ్‌గా తీసుకునే వారు బహు అరుదు. ఓడినా కూడా పైచేయి మాదే అనే వారే ఎక్కువ. కావాలంటే గెలిచిన వారిని మాటలతో ఓడించేందుకు మూడో వ్యక్తినైనా వివాదంలోకి లాగి, తమ శత్రువు శత్రువు తమకి మిత్రుడనే సిద్దాంతాన్ని పాటిస్తారు తప్పితే ఎదుటి వారి విజయాన్ని మనసారా అంగీకరించే పెద్ద మనసు చాలా మందికి ఉండదు. మీడియా మైక్‌ దొరికితే చాలు తమ కసినంతా మాటల ద్వారా తీర్చుకుంటారు. ఇప్పుడు కౌశల్‌ విజయంపై ఆయన వ్యతిరేకుల ధోరణి అలాగే ఉంది. ఇప్పటికే బాబు గోగినేని.. కౌశల్‌ గెలుపు సోషల్‌ మీడియాను మాన్యుపులేట్‌ చేయడం ద్వారా, డబ్బులతో కొన్న ఓట్లుగా తేలిస్తే ఇప్పుడు మరో సెలబ్రిటీ సామ్రాట్‌ మాట్లాడే ధోరణి కూడా అలాగే ఉంది. 

Advertisement
CJ Advs

బిగ్‌బాస్‌2 నుంచి తొలి ఫైనలిస్ట్‌గా సామ్రాట్‌ నిలిచాడు. టాప్‌5లోంచి ముందుగా బయటకు వచ్చింది కూడా ఆయనే. ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ షోలోకి అడుగుపెట్టినప్పుడు ఈయననెందుకు ఈ షోలోకి తీసుకున్నారు అని అందరూ భావించారు. తనీష్‌తో ఉన్నట్లుగానే నేను తేజస్వితో కూడా చనువుగా ఉన్నాను. తాను అమ్మాయి కనుక మమ్మల్ని చాలా మంది అపార్ధం చేసుకున్నారు. ఇక నాని గారితో ఎక్కువగా చీవాట్లు తిన్నది తనీషే అని నా అభిప్రాయం. కౌశల్‌ గురించి చెప్పాలంటే తను ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ‘కుక్కల్లా మీదపడుతున్నారు’ అని ఆయన అన్నప్పుడు చాలా బాధ కలిగింది. ఆయన పట్ల నాకు ఎలాంటి కోపం లేదు. కౌశల్‌ గెలుపు సాధించడం నాకు సంతోషమే. కాకపోతే నా దృష్టిలో అసలు విజేత మాత్రం ‘గీతామాధురి’ అని ఆమెని అనవసరంగా వివాదంలోకి లాగి పొగిడినట్లే పొగుడుతూ తన కసిని, ఈర్ష్యని భయటపెట్టుకున్నాడనే చెప్పాలి. 

Samrat Sensational Comments on Bigg Boss Winner:

Geetha Madhuri is the Real Winner, says Samrat
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs