Advertisement
Google Ads BL

బెల్లంకొండను వదిలి కాజల్‌నే టార్గెట్ చేస్తున్నాడా?


వాస్తవానికి తేజ.. ఎన్టీఆర్‌ బయోపిక్‌ చేయాల్సి ఉన్నా ఆ చిత్రం నుంచి మధ్యలో బయటికి వచ్చాడు. బహుశా రానాకు ‘నేనే రాజు నేనే మంత్రి’ వంటి విజయం అందించిన ఆయన మరోసారి రానాతోనే సురేష్‌బాబుకు చిత్రంచేసే అవకాశం ఉందని పలువురు భావించారు. కానీకొత్త కొత్త హీరోలతో, అందునా అప్‌కమింగ్‌ హీరోలతో ఎక్కువగా చిత్రాలు చేయడానికి తేజ ఇష్టపడతాడు. కారణం స్వతంత్రమైన ఆయన మనస్తత్వ భావాలే అని చెప్పాలి. స్టార్‌ హీరోలతో అయితే రాజీ పడాల్సివస్తుందని ఆయన భావన. గతంలో ‘నిజం’ చిత్రం కూడా అది నిజమేనని నిరూపించింది. 

Advertisement
CJ Advs

ఇక తన తండ్రి బెల్లంకొండ సురేష్‌ పుణ్యమా అని అన్నీ భారీ చిత్రాలు, పెద్ద దర్శకులు, స్టార్‌ హీరోయిన్లతో చిత్రాలు చేస్తూ ఉన్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌కి ఎలాగైనా ఒక పెద్ద కమర్షియల్‌గా వర్కౌట్‌ అయ్యే హిట్‌ ఇవ్వాలనే కసితో బెల్లంకొండ సురేష్‌ అభ్యర్ధన మేరకు తేజ.. సాయిశ్రీనివాస్‌తో చిత్రం చేస్తున్నాడు. అందునా తానే పరిశ్రమకు పరిచయం చేసి, టాప్‌హీరోయిన్‌గా మారిన కాజల్‌ని జోడీగా ఎంచుకున్నాడు. రానాతో తన కెరీర్‌కి ఎంతో కీలకంగా మారిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం కోసం చందమామను ఒప్పించి హిట్‌ కొట్టిన తేజ సాయిశ్రీనివాస్‌తో చేసే చిత్రం కూడా తనకి హిట్‌నిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. రానాకి తేజ, కాజల్‌లు కలసి వచ్చినట్లుగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌కి కూడా వారు కలిసొస్తారా? లేదా? అనేది చూడాలి. 

అంతేకాదు తేజ ఏ ఇమేజ్‌ లేని హీరోలతో బాగా అవుట్‌పుట్‌ రాబట్టుకుంటాడనే పేరుంది. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ కూడా థాయ్‌ల్యాండ్‌లో భారీగానే జరుగుతోందట. థాయ్‌ల్యాండ్‌లోని ఎంతో పేరున్న పర్యాటకకేంద్రంగా, సుందర ప్రదేశంగా పేరున్న నఖోమ్‌ పాథోమ్‌ ప్రావిన్స్‌లో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఇందులోని ఓ సీన్‌ కోసం కాజల్‌ పెద్ద సాహసమే చేసింది. ఓ భారీ కొండ చిలువను మెడలో వేసుకుంది. కొండచిలువను పట్టుకున్న తర్వాత కాజల్‌ మొదట చాలా భయపడిందట. కానీ పక్కనే ఉన్న పర్యవేక్షలు ధైర్యం చెప్పడంతో ఆ షాట్‌ని ఆమె పూర్తి చేయగలిగింది. 

ఈ వీడియోను కాజల్‌, తేజాలు తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అయినా హీరో చేత వీరోచిత విన్యాసాలు చేయించడం వదిలేసి ఇలా హీరోయిన్ల చేత భయంకరమైన ఫీట్లు చేయించడం చూస్తే ఈ కొండచిలువ సీన్‌లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌కూడా ఉంటాడని తెలుస్తోంది. ఎంతైనాహీరోయిన్‌ కొండ చిలువ బారిన పడితే రక్షించాల్సింది హీరోనే కదా..! 

kajal aggarwal’s daredevil act with huge python:

Teja Importance to Kajal Agarwal for His next Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs