Advertisement
Google Ads BL

‘ఆర్ఆర్ఆర్’ పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్


తొలిసారి త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా అనే పాటికి ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ లోను ఆసక్తి ఏర్పడింది. రీసెంట్ గా రిలీజ్ అయిన అరవింద సమేత ట్రైలర్ కు ఇండస్ట్రీ నుండి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దసరా కానుకగా ఈ చిత్రం ఈనెల 11న మన ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడనే విషయం తెలిసిందే.

Advertisement
CJ Advs

రామ్ చరణ్ - ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఈ చిత్రం బడ్జెట్ 300 కోట్లు పైనే అని తెలుస్తుంది. ప్రస్తుతం సినిమాకి సంబంధించి రెండు భారీ సెట్స్ వేసే పనిలో ఉన్నారు జక్కన్న అండ్ టీం. హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీలోను .. అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో ప్రత్యేకమైన భారీ సెట్స్ వేస్తున్నారు.

ఇంతవరకు టైటిల్ ను ప్రకటించిన ఈసినిమాలో హీరోయిన్స్ ఎవరో? ఇతర తారాగణం ఏంటో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు రాజమౌళి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా నవంబర్ చివరి వారంలో గానీ.. డిసెంబర్ మొదటి వారంలో గాని పూజా కార్యక్రమాలు నిర్వహించి  జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపోకోనుంది.

ఫస్టు షెడ్యూల్లో ఎన్టీఆర్ .. ఆ తరువాత షెడ్యూల్లో చరణ్ పాల్గొంటారట. అంతా బాగానే ఉంది కాని సినిమా స్టోరీ ఏంటి అనేది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. స్టోరీపై రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ ఇది తెలుగులో ఎవరూ టచ్ చేయని ఓ పాయింట్ ను రాజమౌళి టేక్ ఆఫ్ చేసి పట్టాలెక్కించనున్నాడనేది ఫిలింనగర్ సమాచారం.

RRR Interested Update:

Shocking Budget to RRR Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs