Advertisement
Google Ads BL

మహేష్ ఇంట్లో దొంగని చూశారా?


దేశంలోనే ఘట్టమనేని ఫ్యామిలీకి ఒక మంచి పేరు ఉంది. సూపర్‌స్టార్‌ కృష్ణ నాడు ఓ వెలుగు వెలిగాడు. ధైర్యం, దమ్ము ఉన్న హీరో అంటే ముందుగా కృష్ణనే గుర్తుకు వస్తారు. నాడు సినీ ఇండస్ట్రీని ఏలుతున్న ఇద్దరు దిగ్గజాలైన ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లతో పోటీ పడి తన సత్తాచాటాడు. యాక్షన్‌, కౌబోయ్‌, గూఢచారి చిత్రాలతోనే కాదు.. సాంఘిక, ఫ్యామిలీ సెంటిమెంట్‌ నుంచి పౌరాణిక, జానపద చిత్రాలు కూడా చేశాడు. తన జయాప జయాలను పట్టించుకోకుండా ఎన్టీఆర్‌ని కాదని మరి 'అల్లూరిసీతారామరాజు' చేసి మెప్పిండం, 'దానవీరశూరకర్ణకి పోటీగా కురుక్షేత్రం తీసి పోటీగా విడుదల చేయడం, సాంకేతికత పరంగా మాత్రం తన చిత్రాన్ని నిలపడం, దేవదాస్‌ పాత్రని చేయడం, 'సింహాసనం' ఇలా ఆయన గట్స్‌కి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. 

Advertisement
CJ Advs

ఇక పెళ్లి నుంచి విరాళాల వరకు, నిర్మాతలను ఆదుకోవడం నుంచి బాలీవుడ్‌లో వెలుగుతున్న హీరోయిన్లను సైతం తన చిత్రాలలో నటించేలా చేయడం ఆయనకే చెల్లింది. ఇక ఆయన వారుసునిగా రమేష్‌బాబు రాణించకపోయిన కృష్ణ కలలను మహేష్‌ తీర్చాడు. ఇక నాటి అధికారంలోని ఎన్టీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు తీయడం, ఎన్నికల ప్రచారంలో కంటికి తీవ్రమైన గాయం, నష్టాలు వచ్చినా ఆయన అదరలేదు. బెదరలేదు. రాజీవ్‌గాంధీ బతికి ఉంటే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే కృష్ణనే సీఎం అయ్యేవాడని కూడా అంటారు. అంతగా ఆయనకు రాజీవ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక ఆయన ముద్దుల మనవళ్లు అయిన మహేష్‌ ఇద్దరు ఆణిముత్యాల వంటి పిల్లలు, కెరీర్‌, ఫ్యామిలీ, నమ్రత కలిగిన నమ్రతాని మహేష్‌ వివాహం చేసుకోవడం వంటివి ఎంతో సంతోషాన్ని ఇచ్చేవే. ఏమాట కామాటే చెప్పుకోవాలి మహేష్‌ ఇద్దరు పిల్లలలో గౌతమ్‌కృష్ణ కంటే సితార అందరినీ ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉంటుంది. 

సితార అల్లరి పాటలు, డ్యాన్స్‌లు చేయడం నుంచి అల్లరిలో కూడా ఆమె టాప్‌. అందుకే యాంటీ మహేష్‌ ఫ్యాన్స్‌ కూడా సితారను ఎంతో ముద్దుగా తీసుకుంటారు. ఇక విషయానికి వస్తే తాజాగా మహేష్‌ ఫొటోలు, వీడియోలు, అప్‌డేట్స్‌ ఇవ్వడంలో ముందుండే నమ్రత తన పాప అల్లరిని మరోసారి అందరికీ చూపింది. ఈమె పోస్ట్‌ చేసిన పిక్‌లో మహేష్‌ నిజంగానే ఆదమరిచి నిద్రపోతున్నట్లు కనిపిస్తే అల్లరి సితార మాత్రం తండ్రి పక్కన ఆయననే ఇమిటేట్‌ చేస్తూ వేళ్లమద్యలోంచి దొంగ చూపులు చూస్తోంది. ఈ ఫోటోకి కొన్ని గంటల్లోనే 85వేల లైక్స్‌ వచ్చాయి. 

Sitara Imitating His Father Mahesh Babu:

Cute Sitara Imitates Her Dad Mahesh Babu !  Namrata Shirodkar Post 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs