Advertisement
Google Ads BL

వీరరాఘవుడిపై అంతా పాజిటివ్‌గానే ఉంది


త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌-ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో మొదటి చిత్రంగా వస్తున్న 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం గురించి చెప్పాలంటే ప్రస్తుతం అనేక వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. మరో వారంలో వీరరాఘవుడు అరవిందతో కలిసి థియేటర్లకు రానున్నాడు. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ ఇప్పటికే 65లక్షల వ్యూస్‌ని సాధించి, ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో ఉంది. ఇక తాజాగా ఈ చిత్రం మేకింగ్‌ వీడియోని సైతం విడుదల చేశారు. అరవింద సమేత సెట్స్‌లో ఏం జరిగిందో చూడండి అని చిత్ర యూనిట్‌ విడుదల చేసిన వీడియోలో ఎన్టీఆర్‌ కుమారుడు అభయ్‌రామ్‌ త్రివిక్రమ్‌ ఒడిలో కూర్చుని బాగా సందడి చేస్తున్నాడు. ఈ షూటింగ్‌ ఎంతో సరదాగా సాగిందని దీనిని బట్టి అర్ధమవుతోంది. కాగా ఈట్రైలర్‌ అదరగొట్టినప్పటికీ పూజాహెగ్డే సొంతగా చెప్పిన డబ్బింగ్‌ మాత్రం కృత్రిమంగా ఉంది. భావోద్వేగాలు, స్వీట్‌నెస్‌ కనిపించడం లేదు. మరి విడుదలకు వారం గ్యాప్‌ ఉన్న సమయంలో ఈమె వాయిస్‌నే ఉంచుతారా? మరొకరి చేత డబ్బింగ్‌ చెప్పిస్తారా? అనేది వేచిచూడాలి. మరోవైపు ఎన్టీఆర్‌ తన తండ్రి హరికృష్ణ హఠాన్మరణంతో కుంగిపోయినా కూడా నిర్మాతను ఇబ్బంది పెట్టకూడదని, కేవలం వారం గ్యాప్‌లోనే బాధని మింగి షూటింగ్‌లో జాయిన్‌ అయ్యాడు. ఈ చిత్రం ఖచ్చితంగా హిట్‌ అవుతుంది కాబట్టి విడుదల తర్వాత మాత్రం ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్‌ ఉండడని, ఈ చిత్రం విడుదల వెంటనే తన తండ్రి బాధ నుంచి కోలుకోవడానికి విదేశాలకు కుటుంబ సమేతంగా వెళ్లి నెలరోజులు గడుపుతాడట. ఆ తర్వాత డిసెంబర్‌లో రాజమౌళి, రామ్‌చరణ్‌లతో జాయిన్‌ అవుతాడని తెలుస్తోంది. 

Advertisement
CJ Advs

మరోవైపు ఈ చిత్రంలో ఇప్పటి వరకు త్రివిక్రమ్‌లో కనిపించని కోణం కనిపించింది. ట్రైలర్‌లో వచ్చిన కత్తులు, బాంబులు, బుల్లెట్లు చూస్తే ఇది త్రివిక్రమ్‌ తన రూట్‌ మార్చి తీసిన మొదటి ఫ్యాక్షన్‌ చిత్రం అని అర్ధమవుతోంది. కానీ అది కూడా కేవలం త్రివిక్రమ్‌ శైలిలోనే ఉంటుందిట. మొదటి భాగం మొత్తం ఎన్టీఆర్‌, పూజాహెగ్డేల మధ్య సరదా సన్నివేశాలను చూపి ఇంటర్వెల్‌ బ్యాంగ్‌కి ముందు ఎన్టీఆర్‌లోని హీరోయిజం చూపించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ చిత్రం మొత్తం వీరరాఘవుడి ఫ్యాక్షనిజం ఉండదని, మనసు మార్చుకున్న హీరో తన ఊరిలోని ఫ్యాక్షనిస్ట్‌లను ఎలా సున్నితంగా ఎదుర్కొన్నాడనేది ఎంతో హృద్యంగా చూపిస్తారట. ఇక ఈ చిత్రం క్లైమాక్స్‌లో భారీ యాక్షన్‌ సీన్స్‌ కాకుండా 'అత్తారింటికి దారేది' తరహాలో క్లైమాక్స్‌ని ఎమోషన్స్‌ చుట్టూ తిప్పుతారని అంటున్నారు. సినిమాకి అసలు క్లైమాక్స్‌ అనేది ఇంటర్వెల్‌ ఫైట్‌ ద్వారా చూపి ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌కి వెళ్తారనే ప్రచారం సాగుతోంది. మరీ కొత్త కథ కాకపోయిన త్రివిక్రమ్‌ మాటల మంత్రం, ఆయన శైలిలో సాగే కథనం, సినిమాని పీక్స్‌కి తీసుకెళ్లేలా సాగే యంగ్‌టైగర్‌ నట విశ్వరూపంలోని నవరసాలు వంటివి హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు. అందుకే కథనం చూసే ఇందులో ఒకే ఒక్క డ్యూయెట్‌ ఉన్నా ఎన్టీఆర్‌ ఒప్పుకున్నాడని తెలుస్తోంది. బహుశా 'మిర్చి' తర్వాత వస్తున్న భారీ ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ చిత్రం ఇదే కావచ్చు. 

అంతేకాదు.. ఈ ఏడాది ద్వితీయార్దంలో విడుదల కాబోయే అతి పెద్ద చిత్రం ఇది మాత్రమే. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు నటన కూడా హైలైట్‌ గా ఉంటుందనేది ట్రైలర్‌ని చూస్తే అర్ధమవుతుంది. నోటిలో బుల్లెట్‌ పెట్టుకుని, ముక్కు మీద గాయంలో జగ్గూభాయ్‌ ఎంతో రఫ్‌గా, నిజంగా పచ్చి ఫ్యాక్షనిస్టా? అనేంతగా ఆయన గెటప్‌ ఉంది. ఆయన నటన కూడా హైలైటే అట. ఎన్టీఆర్‌ 'నాన్నకుప్రేమతో' చిత్రంలో క్లాస్‌ విలన్‌గా కనిపించిన జగ్గు భాయ్‌ ఇందులోని మరో కోణంలో 'రంగస్థలం'లోని పాత్ర కంటే అదిరిపోయేలా చేశాడని అంటున్నారు. సో.. వీటన్నిటిపై క్లారిటీ రావాలంటే 11 వ తేదీ వరకు వెయిట్‌ చేయాల్సింది. మరి త్రివిక్రమ్‌ ఈ చిత్రం ద్వారా బి.గోపాల్‌, వినాయక్‌, బోయపాటి శ్రీను, కొరటాల శివ 'మిర్చి' వంటి వాటికంటే తనదైన ప్రత్యేకతను ఈ ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ చిత్రాన్ని చాటుకుంటాడో లేదో చూడాలి...! 

Positive Points in Aravinda Sametha Veera Raghava:

Aravinda Sametha Movie Pre Release Talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs