Advertisement
Google Ads BL

పూజా కోసం ‘అరవింద’ టీమ్ ఏం చేసిందంటే?


ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన పూజ హెగ్డే సినిమాల షెడ్యూల్స్ మాములుగా లేవు. అమ్మడు అరవింద సమేత - వీర రాఘవ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడానికి కూడా తీరిక లేనంత బిజీ తారగా మారిపోయింది. మామూలుగానే త్రివిక్రమ్ - ఎన్టీఆర్ లు కలిసి అరవింద సమేత షూటింగ్ ని ఆఘమేఘాల మీద పూర్తి చేసి విడుదలకు రెడీ చేశారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న అరవింద పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా డబ్బింగ్ కార్యక్రమాలు చేపట్టారు. ఎన్టీఆర్, ఈషా రెబ్బా వంటి వారు తమ తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పేసుకున్నారు. ఇక మిగతా ప్రమోషన్స్ ని కూడా అరవింద టీం టైం ఉన్నంతలో చక్కబెడుతుంది. సినిమా విడుదలకు కేవలం ఐదు రోజులు మాత్రమే టైం ఉండడంతో అరవింద టీం కింద మీద పడి అరవింద సమేత పనులను ఫినిష్ చేస్తుంది.

Advertisement
CJ Advs

ఇక అరవిందగా టైటిల్ రోల్ ప్లే చేసిన పూజ హెగ్డే అరవింద సమేత షూటింగ్ కంప్లీట్ చేసుకుని... ప్రభాస్ షూటింగ్ తోనూ, మహేష్ మహర్షి షూటింగ్ తోనూ బిజీ అవడమే కాదు.. ఈ మధ్యలో బాలీవుడ్ లో  హౌస్‌ఫుల్‌-4 మూవీ షూటింగ్ లో పాల్గొంటుంది. ఇప్పటికే పూజ హెగ్డే బిజీ షెడ్యూల్ గురించిన ముచ్చట్లు పలుమార్లు వినిపించడం .... అమ్మడు ప్రవేట్ జెట్ లో తన సినిమా షూటింగ్ కోసం తిరుగుతుందని.. ఇక అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా హౌస్‌ఫుల్‌-4 షూటింగ్ జైస‌ల్మీర్‌ లో జరగడంతో రాలేకపోయానని.. ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ కి సారి చెప్పింది. ఇంకా అమ్మడు పూజ అదే బిజీ షెడ్యూల్ మెయింటింగ్ చేస్తుంది.

ఇక అరవింద సమేతలో పూజ హెగ్డే ఓన్ డబ్బింగ్ చెబుతుందని తెలిసిందే. తెలుగులో డబ్బింగ్ పూజ మొదటిసారిగా అరవింద పాత్ర కోసమే ట్రై చేసింది. ఆ డబ్బింగ్ ని అరవింద ట్రైలర్ లో కొద్దిగా విన్నాం కూడా. అయితే మిగిలిన డబ్బింగ్ చెప్పడానికి పూజ హెగ్డే హైదరాబాద్ రావడం లేదట. రాజ‌స్తాన్‌లోని జైస‌ల్మీర్‌లో హిందీ సినిమా హౌస్‌ఫుల్‌-4 షూటింగ్ లో ఉన్న పూజ అక్కడికే అరవింద డబ్బింగ్ స్టూడియో ని తెప్పించుకుందట.  ఒక పక్క బాలీవుడ్ మూవీ షూటింగ్… మరో పక్క తెలుగు సినిమా డబ్బింగ్… ఏం చేయాలో అని ఆలోచించి ఆలోచించి త్రివిక్రమ్ టీమ్‌ని జైస‌ల్మీర్‌లోని త‌న హోట‌ల్ రూమ్‌లో డబ్బింగ్ స్టూడియో ఏర్పాటు చేయమని పూజ అడగడం.... ఇక అరవింద సమేత సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో త్రివిక్రమ్ అండ్ టీం పూజ చెప్పినట్టుగానే ఏర్పాటు చేశారు.

దాంతో పగలు హౌస్‌ఫుల్‌-4 షూటింగ్ చేసి... రాత్రి వేళల్లో అరవింద సమేతకు డబ్బింగ్ చెప్పానని పూజా హెగ్డే చెబుతుంది. గతంలోను అంటే గత నెలలో పూజ హెగ్డే ఉదయం అరవింద సమేత డబ్బింగ్ కార్యక్రమాల్లో పాల్గొని....మధ్యాహ్నం మహర్షి షూటింగ్ లో పాల్గొని రాత్రి అయ్యేసరికి ప్రభాస్ - రాధాకృష్ణ మూవీ షూటింగ్ లో పాల్గొని తన బిజీ షెడ్యూల్ ని చెప్పకనే చెప్పింది. తాజాగా ఇప్పుడు ఇదిగో ఇదొక ఉదాహరణ అమ్మడు ఎంత బిజినో అని చెప్పడానికి..!

Aravinda Sametha Team sensational Decision for Pooja:

Pooja Aravinda Sametha Dubbing at Other movie Shooting Spot
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs