Advertisement
Google Ads BL

సంక్రాంతి రేసులో ఎన్టీఆరే ముందున్నాడు


సంక్రాంతి అంటే సినీ ప్రేక్షకులకి ఎంతో ఇష్టమైన పండగ. ఎందుకంటే సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయ్యే సినిమాలు ఏ సీజన్ లోను రిలీజ్ అవ్వవు కాబట్టి. మన ప్రొడ్యూసర్స్ కూడా ఈ సీజన్ లోనే సినిమాలు రిలీజ్ చేయడానికి చూస్తుంటారు. ఈ సీజన్ లో ఉన్నంత పోటీ.. వసూళ్లు మరీ ఏ సీజన్ లోను ఉండవు. ఒకేసారి మూడు నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ చేసుకునే సౌలభ్యం ఆ సమయంలో మాత్రమే ఉంటుంది. అయితే ఈ సంక్రాంతికి కూడా మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 

Advertisement
CJ Advs

అయితే ముందు నుండి సంక్రాంతికి రిలీజ్ చేస్తాం అని ప్రచారంలో ఉన్న సినిమా మాత్రం 'ఎన్టీఆర్' బయోపిక్ ఒక్కటే. సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఏదో ఒకరకంగా సినిమాపై అంచనాలు పెంచుతూ పోస్టర్స్ రూపంలో విడుదల చేస్తున్నారు. దాంతో  ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లో హైప్ పెరిగి.. సినిమాకు అనూహ్య స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. బాలకృష్ణ కెరీర్ లో ఇప్పటిదాకా అత్యధికంగా రూ.60 కోట్ల షేర్ అందుకున్నాడు. అయితే 'ఎన్టీఆర్' చిత్రం ప్రీ రిలీజ్ బిసినెస్ మాత్రం ఏకంగా రూ.100 కోట్ల దాకా చేసింది. ఇది అనూహ్యమే. ఈ లెక్కన సినిమా ఎంత వసూల్ చేయాలో అర్ధం చేసుకోండి. బాలకృష్ణ, క్రిష్ లతో పాటు ప్రొడ్యూసర్స్ కూడా ఈ సినిమాపై కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 

ఈ సినిమాకి పోటీగా  చరణ్-బోయపాటి సినిమా విడుదల అవుతుంది. కానీ ఇంతవరకు ఈ సినిమాకు సంబంధించి కనీసం టైటిల్ కూడా ప్రకటించలేదు. ఫస్ట్ లుక్ రాలేదు. 'ఎన్టీఆర్' లా ఇప్పటి నుండే ప్రమోషన్స్ చేసి హైప్ పెంచితే సినిమాకు మరింత కలిసొచ్చే అవకాశముంది. కానీ ప్రొడ్యూసర్స్ ఆ దిశగా ఆలోచించట్లేదు. ఇక ‘ఎఫ్-2’కైతే ఇప్పటిదాకా ఏమంత హైప్ కనిపించట్లేదు. ఈ సినిమా ఆ రెండు సినిమాల పోటీకి తట్టుకుంటుందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.  కానీ దిల్ రాజు మాత్రం ఈసినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయనుంది ఈ సినిమా. ఈసారి సంక్రాంతి సీజన్ కి ఎవరు విన్ అవుతారో చూడాలి.

NTR Full Speed in Promotions:

Sankranthi Race: Balayya in 1st Place
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs