Advertisement
Google Ads BL

బిగ్‌బాస్‌ టైటిల్‌ కంటే ఇదే గొప్పది: కౌశల్


నిజంగా బిగ్‌బాస్‌ సీజన్‌1 విజేత శివబాలాజీ కంటే ఎన్నోరెట్లు ఎక్కువగా సీజన్‌2 విజేత కౌశల్‌ నిలిచాడు. ఓ సాధారణమైన చిన్నచిన్నపాత్రలు చేసుకుని, సీరియళ్లలో కూడా విలన్‌గా వేషాలు వేసే నటునికి ఈ స్థాయి ఆదరణ కనివినీ ఎరుగనిదని ఒప్పుకోవాలి. ఎవరూ దీనిని ఊహించలేకపోయారు. కేవలం వారం రెండు వారాలతో ఓ టాప్‌స్టార్‌ స్థాయిలో కౌశల్‌కి సొంత ఆర్మీ ఏర్పడటం సామాన్యమైనది కాదు. సినీ ప్రముఖులే కాదు.. ఎందరో కౌశల్‌కి ఇంతలా అభిమానులు ఎలా ఏర్పడ్డారా? అనే ఆలోచన నుంచి ఇప్పటికీ బయటకు రాలేకపోతున్నారు. ఓ స్టార్‌ హీరో వారసుడు సినీ తెరంగేట్రం చేసేటప్పటి కంటే కౌశల్‌కి వచ్చిన మద్దతు చూసి ఆశ్చర్యచకితులై పోతున్నారు. బుల్లితెర మీద ఇదో అద్భుతం అనే మాటలు కూడా దానిని వర్ణించలేవు. మరి ఇంతగా ఆయనకు క్రేజ్‌ ఏర్పడేందుకు కారణం ఏమిటనేది బుర్రలు బద్దలు కొట్టుకున్నా అర్ధం కాని పరిస్థితి. ఏకంగా హోస్ట్‌ నాని నుంచి పార్టిసిపెంట్స్‌ అందరినీ కౌశల్‌ అభిమానులు శాసించారు. 

Advertisement
CJ Advs

ఇక బిగ్‌బాస్‌ విజేతలకు వచ్చే క్రేజ్‌ సినిమాలకి ఏ విధంగానూ ఉపయోగపడదని అంటున్నా కూడా.. కౌశల్‌ విషయంలో మాత్రం ఇది తప్పుగా నిరూపితం అవుతుందా? అనే ఆశ కూడా ఉంది. ఈ మద్దతు, క్రేజ్‌ని చూసి కౌశల్‌ హీరోగా క్రౌడ్‌ ఫండింగ్‌ చిత్రమే కాదు.. పలువురు నిర్మాతలు, పెద్ద పెద్ద స్టార్స్‌ చిత్రాల వారు కూడా కౌశల్‌కి తమ చిత్రంలో చాన్స్‌ ఇస్తే సినిమాకి ప్లస్‌ అవుతుందనే ఆలోచనలో ఉన్నారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు కూడా బిగ్‌బాస్‌ సీజన్‌2 విజేత అయిన కౌశల్‌ అభిమానులు ఆకట్టుకోవడం కోసం ఆయనపై ప్రశంసల జల్లు కురిపించేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. 

ఇక తనకి మహేష్‌ అంటే ఎంత అభిమానమో ఇప్పటికే కౌశల్‌ చెప్పాడు. తాను బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ప్రవేశించానంటే దానికి స్ఫూర్తి మహేషే అని చెప్పుకొచ్చాడు. ఇక తన మోడల్‌ ఏజెన్సీ నుంచి తను తెరంగేట్రం చేసిన చిత్రం 'రాజకుమారుడు' వరకు మహేష్‌ చేసిన సాయాన్ని చెప్పి కౌశల్‌ మహేష్‌ ఫ్యాన్స్‌ రుణం తీర్చుకున్నాడు. ఇప్పుడు ఆయనకు బిగ్‌బాస్‌ టైటిల్‌ కంటే అరుదైన బహుమతి లభించింది. అది కౌశల్‌ని, ఆయన అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదేమిటంటే స్వయంగా మహేష్‌, కౌశల్‌ని అభినందిస్తూ చేసిన ట్వీట్‌. తాజాగా మహేష్‌ ట్వీట్‌ చేస్తూ, కంగ్రాట్యులేషన్స్‌ కౌశల్‌. ఇదో గొప్ప విజయం. నిన్ను చూసి నేను ఎంతో సంతోషిస్తున్నా.. నీ విజయాన్ని ఆస్వాదించు అని చేసిన ట్వీట్‌ని కౌశల్‌ ఆర్మీ వైరల్‌ చేస్తోందనే చెప్పాలి...! 

Mahesh Babu Tweets About Kaushal's Victory:

Mahesh Babu Superb Tweet On Bigg Boss Telugu 2 Winner Kaushal
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs