Advertisement
Google Ads BL

పెట్టా సెకండ్ లుక్ అదిరింది


'రోబో' చిత్రం తర్వాత సూపర్ స్టార్ రజినీకి సరైన హిట్ లేదు. కూతురు సౌందర్య దర్శకత్వంలో వచ్చిన 'కొచ్చాడయాన్' డిజాస్టర్ గా నిలించింది. ఆ తర్వాత పా. రంజిత్ దర్శకత్వంలో 'కబాలి'...'కాలా' చిత్రాలు అనుకున్న స్థాయిలో ఆడలేకపోయాయి. కానీ రజినీని సరికొత్తగా చూపించాయి ఈ రెండు చిత్రాలు. రజిని తన కెరీర్ స్టార్టింగ్ నుండి ప్రయోగాలు చేయటం అలవాటు.

Advertisement
CJ Advs

తన సినిమాల్లో ఏదొక విధంగా తన స్టైల్ తో కానీ.. తన లుక్స్ తో కానీ.. తన బాడీ లాంగ్వేజ్ లో కానీ డిఫరెంట్ గా చేస్తుంటారు. అయితే అలానే పండిన తలకట్టు - మీసం- గడ్డంతో  మాస్ అవతార్ లో  కనిపించి ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో సర్ ప్రైజ్ చేశారు రజిని. ప్రస్తుతం రజిని కార్తీక సుబ్బరాజ్ డైరెక్షన్ లో 'పెట్టా' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంకి సంబంధించి రజని లుక్ ఒకటి బయటికి వచ్చింది. ఇందులో రజిని పెద్ద మీసంతో..తమిళన్ లా దర్శనమిచ్చారు.

తన పాత క్లాసిక్ రోజుల్ని గుర్తు చేసినట్టయ్యింది. గతంలో 'ముత్తు'.. 'అరుణాచలం' గెటప్స్ ను తలపిస్తున్న ఈ లుక్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. తెల్ల పంచె..తెల్ల లుంగీ కట్టుకుని నుదుట మూడు నామాలు విబూది పెట్టుకుని చాలా యంగ్ ఏజ్ లా మారిపోయాడు సూపర్ స్టార్. అంతకుముందు రిలీజ్ అయిన లుక్ కి ఈ లుక్ కి చాలా డిఫరెన్స్ ఉంది. దీనిని బట్టి చూస్తుంటే ఇది ఒక డిఫరెంట్ స్టోరీ అని అర్ధం అవుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

Petta Second Look Released:

Rajinikanth Second Look in Petta
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs