Advertisement
Google Ads BL

యంగ్ టైగర్ ఫ్యాన్స్ కోరుకునేది ఇదేగా..!


ఎన్టీఆర్ అరవింద సమేత ట్రైలర్ విడుదలైంది. అందులో ఎన్టీఆర్ నట విశ్వరూపం అంటే.. మాస్, క్లాస్ తో ఇరగదీశాడు. హీరోయిన్ పూజ హెగ్డే తో రొమాంటిక్ యాంగిల్ తోపాటుగా శత్రువులను తెగ నరకడం, ముఖంలోని గంభీరం, కోపం అన్ని ఎన్టీఆర్ ని అన్ని యాంగిల్స్ లో పరిచయం చేశాయి. ఇక పూజ హెగ్డే ఒకానొక సమయంలో ఎన్టీఆర్ ని అలా క్యూట్ గా చూడకురా బాబు అన్నప్పుడు ఎన్టీఆర్ ఫేస్ ఎంత బావుందో కూడా చూశాం. ఇక చొక్కా లేకుండా ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ని కూడా తనివి తీరా ఆస్వాదించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అరవింద సమేత ట్రైలర్ లో ఒకటి మిస్ అయినందుకుగాను బాగా ఫీల్ అయ్యారు.

Advertisement
CJ Advs

అది మరేదో కాదు యంగ్ టైగర్ డాన్స్. డాన్స్ ల్లో ఎన్టీఆర్ కి మించిన స్టార్ హీరో లేదనేది ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సాధారణ ప్రేక్షకుడు చెబుతాడు. ఎన్టీఆర్ డాన్స్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ సినిమాల్లో ఎన్టీఆర్ ఎంతమందిని నరుకుతాడో అని ఎదురు చూసే ఫ్యాన్స్... ఆ సినిమాలో పాటలకు ఎన్ని స్టెప్స్ వేస్తాడో అని ఫ్యాన్స్ మాత్రమే కాదు డాన్స్ ప్రేమికులు ఎదురు చూస్తారు. అందుకే ఎన్టీఆర్ సినిమా వస్తుంది అంటేనే ఎన్టీఆర్ ఎలాంటి స్టెప్స్ తో పాటల్లో హీరోయిన్స్ తో డాన్స్ వేస్తాడో అంటూ ఆసక్తి కనబరుస్తారు. కానీ అరవింద సమేత ట్రైలర్ లో ఎన్టీఆర్ డాన్స్ కి సంబందించిన ఒక్క బిట్ కూడా త్రివిక్రమ్ కట్ చెయ్యకపోయేసరికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉసూరుమన్నారు. ఇక ఎన్టీఆర్ అరవింద ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డాన్స్ నటనలో భాగం మాత్రమే.. డాన్స్ మాత్రం జీవితం కాదు అంటూ అభిమానులకు సర్ది చెప్పాడు.

అన్నీ ఉన్నా ఏదో వెలితి అన్నట్టుగా ఫీల్ అయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా ఆ ముచ్చట కూడా తీరింది. ఎన్టీఆర్ అదిరిపోయే స్టెప్స్ వేసిన సాంగ్ వీడియో ఒకటి నిన్న గురువారం అరవింద  సమేత టీం విడుదల చేసింది. అరవింద ఆడియో ఆల్బమ్ లో మొదటి సాంగ్ గా విడుదలైన అనగనగా అరవిందట తన పేరు.. అనే సాంగ్ ప్రోమోలో ఎన్టీఆర్ డాన్స్ ఉంది చూశారా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెట్టుకున్న అసలు మరింత పెంచేశాయి. అంత అద్భుతమైన డాన్స్ తో ఎన్టీఆర్ ఇరగదీశాడు. అనగనగా అరవిందట తన పేరు.. పాట కన్నా ఎక్కువగా ఎన్టీఆర్ స్టెప్స్ అదిరినయ్ అంటే... ఎన్టీఆర్ డాన్స్ ఎంత బావుందో తెలుస్తుంది. ఇక ఏ పాటల్లోనూ ఎన్టీఆర్ డాన్స్ చెయ్యకపోయినా... ఈ స్టెప్స్ చాలు అన్నట్టుగా ఉంది ఎన్టీఆర్ అనగనగా అరవిందట తన పేరు.. లో డాన్స్. మరి ఫ్యాన్స్ ఇది కదా.. మీకు కావాల్సింది.

Young Tiger Fans Want This :

Aravinda Sametha Latest Updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs