Advertisement
Google Ads BL

‘అరవింద’లో అన్యాయం జరిగినట్లేనా?


ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్ లోను యంగ్ టైగర్ లేటెస్ట్ మూవీ అరవింద సమేత ఫీవర్ స్టార్ట్ అయ్యింది. ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాదు. సగటు ప్రేక్షకుడికి ఇప్పుడు అరవింద సమేత సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. మొన్న రాత్రి జరిగిన అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ తండ్రి మరణంతో పెట్టుకున్న కన్నీళ్లకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు. సాధారణ ప్రేక్షకుడు కూడా కరిగిపోయాడు. అందుకే ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. మరో వారంలో విడుదల కాబోయే అరవింద సమేత - వీర రాఘవ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకచక జరుగుతున్నాయి. అందుకే కొంతమంది ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి కూడా హాజరవలేదని త్రివిక్రమ్.. ఆ ఈవెంట్‌లో చెప్పాడు.

Advertisement
CJ Advs

ప్రస్తుతం అరవింద పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయని అంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా పూజా హెగ్డేతో పాటుగా ఈషా రెబ్బా ఒక పాత్రలో నటించింది. స్టార్ హీరో సినిమాలో స్టార్ డైరెక్టర్ పిలిచి రెండో హీరోయిన్ పాత్ర ఇచ్చినప్పటికీ.. ఈషా రెబ్బాకి ఈ అవకాశం.. తర్వాత సినిమాలకు పనికొస్తుందని ఆశతో ఉంది. అయితే అరవింద సమేతలో ఈషా రెబ్బ, పూజా హెగ్డే కజిన్స్ అంటే అక్కచెల్లెళ్లుగా కనిపిస్తారని టాక్ ఉంది. ఇక స్టార్ హీరో సినిమాలో వచ్చిన ఈ అవకాశంతో పొంగిపోతున్న ఈషా రెబ్బాకి షాక్ ఇచ్చిందట అరవింద సమేత టీం. ఈ సినిమాలో కథానుసారంగా ఈషా పాత్ర‌కు అంత స్కోప్ లేద‌ట‌. త్రివిక్ర‌మ్ క‌థ‌గా రాసుకున్న‌ప్పుడు ఈషా పాత్ర బాగానే ఉన్నా, ఆ త‌ర‌వాత జ‌రిగిన మార్పుల్లో ఈషా పాత్రకు ఎడిటింగ్ ఎక్కువైందని టాక్‌. 

అసలు అరవింద షూటింగ్ సెట్స్ మీదకెళ్ళకముందే ఈషా రెబ్బా కి సంబంధించిన స‌న్నివేశాల‌కు బాగా క‌త్తెర్లు ప‌డిపోయాయ‌ని ఓ వార్త హల్చల్ చేస్తోంది‌. ఇక ఈషా ఇచ్చిన 15 రోజుల కాల్షీట్లో ఈషాపై తెర‌కెక్కించింది కేవలం అంటే కేవలం నాలుగు స‌న్నివేశాలే అని.... ఈషా పాత్ర సినిమాలో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుందని.. అందుకే ఈ సినిమాలో ఈషా పాత్ర గొప్పగా ఏమి ఉందనేది ఫిలింసర్కిల్స్ లో నడుస్తున్న టాక్. ఇక అరవింద సమేత ట్రైలర్ చూసినప్పుడు కూడా ఈషా రెబ్బా చాలా చిన్న సీన్ లో కనిపించి మాయమైంది. మరి ఇదంతా చూస్తే పైన చెప్పిందే నిజమేమో అనిపించకమానదు. మరి ఈషా ఏమో తన పాత్ర సినిమా మొత్తం ఉంటుందని.. అది కూడా ఎన్టీఆర్‌తో కలిసి ఉంటుందని ఒకానొక ఇంటర్వ్యూ లో చెప్పింది. మరి ఇప్పుడేమో ఈషా రెబ్బా పాత్రకు అరవింద లో ప్రాధాన్యత లేదంటున్నారు. 

Discussions on Eesha Rebba Role in Aravinda Sametha:

No Importance to Eesha Rebba Role in Aravinda Sametha Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs