Advertisement
Google Ads BL

అతిలోక సుందరి దర్శనం ఆరోజేనంట!


ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్‌గా నటిస్తోన్న బయోపిక్‌ ‘ఎన్టీఆర్‌’ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లుగా అఫీషియల్‌గా కూడా ప్రకటించారు. ఇక ఈ చిత్రం రెండు పార్ట్‌లుగా విడుదల కాబోతోంది. ఇదే విషయం ఈ చిత్రానికి మొదటి దర్శకుడైన తేజ కూడా చెప్పిన సంగతి తెలిసిందే. జనవరి నాటికి అంటే ఎన్నికల వేడి మరింతగా పెరుగుతుంది. మరి అప్పటి పరిస్థితుల్లో ఎన్టీఆర్‌ చిత్రం ఎలాంటి సంచలనాలకు శ్రీకారం చుడుతుందో చూడాలి. 

Advertisement
CJ Advs

మరో వైపు ఈ చిత్రంలో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, బసవతారకంగా విద్యాబాలన్‌, ఏయన్నార్‌గా సుమంత్‌, నారా చంద్రబాబు నాయుడుగా దగ్గుబాటి రానా వంటి వారు నటిస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు మరిన్ని ముఖ్యపాత్రలకు నటీనటులను ఎంపిక చేసుకుంటూనే షూటింగ్‌ని స్పీడ్‌గా పూర్తి చేస్తున్నారు. ఇక ఇందులో అలనాటి అతిలోక సుందరి, ఎన్టీఆర్‌ సరసన ఎన్నో చిత్రాలలో నటించి, ఇటీవల ఆకస్మిక మరణం పాలైన శ్రీదేవి పాత్రలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ మెరవనుంది. కేవలం కొద్ది సేపు మాత్రమే ఉండే ఈ పాత్రకి సంబంధించిన షూటింగ్‌ ఎప్పుడో పూర్తి కావాల్సివుంది. కానీ రకుల్‌ బాలీవుడ్‌ చిత్రంతో బిజీగా ఉండటం వల్ల వీలుకాలేదు. 

శ్రీదేవి పాత్ర కోసం రకుల్‌ 10రోజుల కాల్షీట్స్‌ కేటాయించిందట. ఈనెల 10వ తేదీన రకుల్‌ జన్మదినం కావడంతో ఆరోజున శ్రీదేవిగా కనిపించే రకుల్‌లుక్‌ని విడుదల చేస్తారని సమాచారం. ఒకవైపు తెలుగులో శ్రీదేవికి ఉన్న క్రేజ్‌, మరోవైపు రకుల్‌కి ఉన్న ఇమేజ్‌ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అందరు నమ్ముతున్నారు. 

One more interesting news on NTR Biopic:

Details of Rakul preet singh Look From NTR Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs