Advertisement
Google Ads BL

ఈ డైరెక్టర్‌కి శర్వా.. ఛాన్సిస్తాడా..?


సుధీర్ బాబు ప్రొడక్షన్ లో డెబ్యూ డైరెక్టర్ ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వంలో సుధీర్ బాబు - నభ నటేష్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. దర్శకుడికి మొదటి చిత్రమే అయినప్పటికీ.. ఈ సినిమాని బాగానే తెరకెక్కించాడనే పేరొచ్చింది. ఇక నన్ను దోచుకుందువటే తర్వాత హీరో సుధీర్ బాబు తన తదుపరి చిత్రం పుల్లెల గోపీచంద్ బయోపిక్ కి సిద్దమవగా.. హీరోయిన్ నభ నటేష్.. రవితేజ చిత్రానికి హీరోయిన్‌గా ఎంపికయ్యింది. ఇక దర్శకుడు ఆర్ ఎస్ నాయుడుకి మంచి అవకాశాలొస్తున్నాయనే టాక్ నన్ను దోచుకుందువటే సినిమా విడుదలయినప్పటి నుండి వినబడుతుంది.

Advertisement
CJ Advs

తాజాగా ఆర్ ఎస్ నాయుడుతో సినిమా చేసేందుకు పడి పడి లేచె మనసు నిర్మాత సుధాకర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. అది కేవలం ఇంట్రెస్ట్ మాత్రమే కాదని.. ఇప్పటికే నిర్మాత సుధాకర్.. తమ బ్యానర్ లో సినిమా చేసేందుకు గాను ఆర్ ఎస్ నాయుడు కి అడ్వాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఆర్ ఎస్ నాయుడు డైరెక్షన్ లో సుధాకర్ నిర్మాతగా చెయ్యబోయే సినిమా కోసం ఇంకా హీరో ఎవరూ సెట్ కాలేదుకాని.. ఆర్ ఎస్ నాయుడు కి మాత్రం హీరో శర్వానంద్ తో పనిచేయాలనే కోరికతో ఉన్నాడట. ఇప్పటికే ఈ దర్శకుడు శర్వానంద్ కి ఓ లైన్ కూడా వినిపించినట్లుగా తెలుస్తుంది.

అయితే శర్వానంద్ ప్రస్తుతమైతే హను రాఘవపూడి తో పడి పడి లేచె మనసు సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా డిసెంబర్ 21 న విడుదల అని మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించారు. కానీ ఈమధ్యన ఆ సినిమా వాయిదా పడే అవకాశాలున్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇకపోతే పడి పడి లేచె మనసుతో పాటుగా సుధీర్ వర్మ సినిమా కూడా శర్వానంద్ మొదలు పెట్టాడు. ఆ సినిమా విషయమై ఎక్కడా చడీ చప్పుడు లేదు. అలాగే మరొక డైరెక్టర్ కి కూడా శర్వానంద్ కమిట్ అయ్యాడనే న్యూస్ ఉంది. మరి ఈ మూడు సినిమాలు ఫినిష్ చేశాకే ఆర్ ఎస్ నాయుడుకి కమిట్ అయినా.. వదిలేసినా. మరి అంతవరకూ ఆర్ ఎస్ నాయుడు ఆగుతాడా.. లేదా.. అనేది ప్రస్తుతం సస్పెన్స్.

Nannu Dochukunduvate Director Waiting for Sharwanand:

Sharwanand and RS Naidu Combo Movie Soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs