Advertisement
Google Ads BL

తనుశ్రీ.. మరోసారి ఫైర్ అయ్యింది..!


ఆడవారికి జరుగుతున్న అన్యాయాలు, దోపిడీ, లైంగిక వేధింపులు, కాస్టింగ్‌కౌచ్‌ వంటి వాటి గురించి మాట్లాడాలంటేనే వెనుకాడవలసిని పరిస్థితి నెలకొంది. ఆమెకి మద్దతుగా మాట్లాడుతూనే కాస్త చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు కదా? అనే ఒకే ఒక్క మాట అన్న పాపానికి శ్రీరెడ్డి.. పవన్‌పై విరుచుకుపడి ఆయనను రచ్చ చేసింది. అవునంటే కప్పకు కోపం.. కాదంటే పాముకి కోపం అన్నట్లుగా పరిస్థితి మారింది. ఎవరైనా ఈ విషయంలో ఏమైనా మాట్లాడితే దానికి పెడార్ధాలు తీస్తూ, తమకు మద్దతుగా మాట్లాడిన వారినే అసలు సమస్యలోకి లాగుతూ ఉన్నారు. శిల్పాశెట్టి.. తనుశ్రీ దత్తాకి మద్దతు తెలిపితే, మరి నీ సంగతేంటి? నీ భర్త సంగతేంటి? అని తను మాట్లాడింది. ఏదో కీర్తిసురేష్‌ నవ్విందని చెప్పి శ్రీరెడ్డి నిన్ను జీవితాంతం గుర్తుంచుకుంటాను అంటూ హెచ్చరించింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఎందుకు స్పందిస్తారు? అలా స్పందిస్తే తమపై విమర్శలకు తామే తావిచ్చినట్లు అవుతుందని పలువురు భావిస్తున్నారు. అలాగని మౌనంగా ఉంటే మరో విధంగా వివాదంలోకి ఈడుస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఇక తనుశ్రీ ఎప్పుడో ఎనిమిదేళ్ల కిందట జరిగిన దానిపై ఇప్పుడు మాట్లాడుతోంది. మొదట నానాపాటేకర్ ని, తర్వాత గణేష్‌ ఆచార్యను, మరోసారి వివేక్‌ అగ్నిహోత్రిలను ఇలా ఆమె లిస్ట్‌ పెరుగుతూనే ఉంది. ఇక ప్రియాంకాచోప్రా, రిచ్చాచద్దా, సోనమ్‌ కపూర్‌, ఫరాన్‌ అక్తర్‌, సోనమ్‌ కపూర్‌ వంటి వారు తనుశ్రీకి మద్దతు ఇస్తున్నారు. మరోవైపు తను తన తల్లిదండ్రులతో కారులో వెళ్తున్నప్పుడు జరిగిన దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తాజాగా మాజీ సుందరి డింపుల్‌ కపాడియా మాట్లాడుతూ, టాలెంట్‌లో నానాకి పోటీ వచ్చే వారు ఎవ్వరూ లేరు. ఆయనకు ఆయనే సాటి. అలాంటి టాలెంటెడ్‌ వ్యక్తులు వంద తప్పులు చేసినా నేను క్షమిస్తాను. ఒక మనిషిగా ఆయన ఎంతో మంచిగా, స్నేహంగా ఉండేవారు. కానీ ఆయనలోని చీకటి కోణాన్ని నేను చూశాను. ప్రతి వ్యక్తి విషయంలో చీకటి కోణం ఉంటుంది. దానిని మనం దాచిపెడతాం... అని వ్యాఖ్యానించింది. 

ఇక తనుశ్రీ విషయంలో స్పందించడానికి అమితాబ్‌ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీనిపై తనుశ్రీ మండిపడింది. ఆమె మాట్లాడుతూ, అమ్మాయిల సమస్యలపై మాట్లాడని అమితాబ్‌ వంటి వ్యక్తులు, సామాజిక కథాంశాలలో నటిస్తూ 'పింక్‌'వంటి చిత్రాలు చేస్తున్నారు. నిజజీవితంలో కళ్లెదుటే జరిగే అన్యాయాలను ఖండించని వీరు కళ్లు మూసుకుంటారు.. కాస్టింగ్‌కౌచ్‌ విషయంలో నేను చివరి దాకా పోరాడుతాను. కాస్టింగ్‌కౌచ్‌ కారణంగానే 30, 40 చిత్రాలు వదులుకున్నాను. మిస్‌ యూనివర్స్‌ని అయిన నేను చీప్‌పబ్లిసిటీ కోసం, అటెన్షన్‌ సాధించడానికో.. సినిమాలలో వేషాల కోసమో.. బిగ్‌బాస్‌ షోల కోసమో ఇలా చేయడం లేదు. త్వరలో అమెరికాకి వెళ్లిపోతున్నాను. బాలీవుడ్‌లో నటించే పనే లేదు. సెలబ్రిటీల విషయంలో నాకు మద్దతు లభించినా, ప్రజల నుంచి మాత్రం మద్దతు రాలేదని తెలిపింది. మరోవైపు ఆమెకి లీగల్‌ నోటీసులు పంపిన నానా 'హౌస్‌ఫుల్‌ 4' చిత్రం షూటింగ్‌కి హాజరు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని సమాచారం. 

Tanushree Dutta Fires on Big B:

Tanushree Dutta sensational Comments on Big B
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs