Advertisement
Google Ads BL

శివబాలాజీకి పవన్.. మరి కౌశల్‌కి?


బిగ్‌బాస్‌ తొలి సీజన్‌ విజేత శివబాలాజీ. ఆయనతో పవన్‌కి మంచి సన్నిహితం ఉంది. ఆయన నటించిన 'అన్నవరం, కాటమరాయుడు' చిత్రాలలో శివబాలాజీ నటించాడు. దీనికి పవన్‌ ఫ్యాన్స్‌ ఇచ్చిన మద్దతు, వారు వేసిన ఓట్లే కారణమని నాడు ప్రచారం జరిగింది. ఇక సీజన్‌2 విజేత కౌశల్‌ విషయంలో హడావుడి మామూలుగా జరగలేదు. 

Advertisement
CJ Advs

తాజాగా కౌశల్‌ మహేష్‌బాబు గురించి మాట్లాడుతూ, మహేష్‌బాబు తొలి చిత్రమే నాకు కూడా సినిమాలలో మొదటి చిత్రం. ఆయనతో అప్పటి నుంచే ఎంతో సాన్నిహిత్యం ఉంది. మహేష్‌ లేనిదే నేను లేను. నేను బిగ్‌బాస్‌కి వచ్చానంటే దానికి కారణం మహేష్‌బాబే. హైదరాబాద్‌లో తొలిసారి మోడలింగ్‌ అకాడమీని స్థాపించింది నేనే. అందులో మహేష్‌ ఎంతో సాయం చేశాడు. రాజకుమారుడు షూటింగ్‌ జరుగుతున్నసమయంలోనే మహేష్‌ దగ్గరుండి మోడలింగ్‌ అకాడమీ స్థాపనకు సాయం చేశాడు. 

రాఘవేంద్రరావు కూడా ఎంతో హెల్ప్‌ చేశారు. ఆ ఏజెన్సీ లేకపోతే నేనెప్పుడో వైజాగ్‌కి తిరిగి వెళ్లిపోయి ఉండేవాడిని. నా గెలుపుకు కృషి చేసిన కౌశల్‌ ఆర్మీకి కృతజ్ఞతలు అని తెలిపాడు. అంటే శివబాలాజీ వెనుక పవన్‌ఫ్యాన్స్‌ ఉన్నట్లు కౌశల్‌ వెనుక మహేష్‌బాబు ఉన్నాడని అనిపిస్తోంది. 

Kaushal About that Hero at Kaushal Army Celebrations:

Kaushal Shares Mahesh Babu's Greatness
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs