Advertisement
Google Ads BL

కళ్యాణ్ రామ్ ఏడిపించేశాడు..!!


ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అరవింద సమేత - వీర రాఘవ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో అభిమానుల కోలాహలం మధ్యన గ్రాండ్ గా నిర్వహించారు .. అరవింద బృందం. ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ - త్రివిక్రమ్ - జగపతి బాబు - దిల్ రాజు.. రాజమౌళి కొడుకు కార్తికేయ,  కోడలు పూజ ఇలా సినిమాకి సంబందించిన టీంతో పాటుగా కొద్దిమంది సన్నిహితులు హాజరయ్యారు. ఈ వేడుకకి హాజరైన కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు విషణ్ణ వదనాలతో కనిపించారు. ఇక హీరోయిన్ పూజ హెగ్డే ఇతర సినిమా షూటింగ్స్ బిజీతో ఈ ఈవెంట్ కి హాజరుకాలేకపోయింది. భారీ అంచనాలున్న అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అరవింద సమేత ట్రైలర్ ని కళ్యాణ్ రామ్ స్టేజ్ ఎక్కి విడుదల చేశాడు. మాస్ అండ్ క్లాస్ తో అరవింద సమేత టీజర్ అదిరింది. మరి ఈ టీజర్ చూస్తుంటే. ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ ల కలయిక ఎలా ఉంటుందో అనేది అర్ధమైపోయింది. ట్రైలర్ మొత్తం క్లాస్ తో మాస్ తో ఇరగదీసేసింది. 

Advertisement
CJ Advs

ఇక ట్రైలర్ రిలీజ్ చేసిన కళ్యాణ్ రామ్ తన తండ్రితో ఉన్న అనుబంధం గురించి మట్లాడుతూ.. తన తండ్రి చెప్పిన మాటలను మరోమారు గుర్తు చేసుకున్నాడు. తన ఫ్యామిలిలో తన తాతగారికి నిర్మాతల పట్ల, పనిపట్ల ఉన్న డెడికేషన్ గురించి చెప్పాడు. 1960 ల్లో సీనియర్ ఎన్టీఆర్ షూటింగ్ లో ఉండగా.. పెద్ద కొడుకు రామకృష్ణ మరణం సంభవించినా.. షూటింగ్ అయ్యాకే వెళ్లారని... నిర్మాతలని దేవుళ్లుగా భావించేవారని.. వారు నష్టపోకూడదని....అలాగే మళ్ళీ 70 లో ఒకసారి తన ముత్తాతగారు చనిపోయినప్పుడు కూడా తన తాతగారు షూటింగ్లోనే ఉన్నారని, ఇక తన తండ్రి కూడా నిర్మాతలను గౌరవించాలని.. వారిని నష్టపోయేలా చెయ్యకూడదని చెప్పేవారని.. అందుకే తమ్ముడు ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణ చనిపోయిన ఐదో రోజునే అరవింద సమేత షూటింగ్ కి వెళ్లాడని.. తండ్రి మరణంతో అరవింద ఆగుతుందనుకున్నారని.. కానీ తండ్రి మాటలను గుర్తు చేసుకుని అరవింద షూటింగ్ ని నెలరోజుల్లో తమ్ముడు పూర్తి చేశాడని చెప్పాడు.

ఇక తండ్రి హరికృష్ణ చనిపోయి దూరమవ్వలేదని.. మన మనసులలో బ్రతికే ఉన్నారని... మనందరిలో ఆయన ఎప్పుడూ ఉంటారని చెప్పిన కళ్యాణ్ రామ్ ఎంతో బాధతో ఒక పాట కూడా పాడాడు. అలాగే తమ్ముడు ఎన్టీఆర్ ని నాన్నా అని సంబోధిస్తూ స్టేజ్ మీదకి పిలిచి తండ్రి మరణానికి రెండు నిమిషాల మౌనం పాటించాలని అభిమానులను కోరాడు. ఇక తండ్రి మరణంతో తామెంత కుంగిపోయామో అనేది కళ్యాణ్ రామ్ స్పీచ్ తో అర్ధమయ్యింది. ఇక కళ్యాణ్ రామ్ బాధాతప్త హృదయంతో మాట్లాడిన మాటలు, ఎన్టీఆర్ కన్నీళ్లు అన్ని అభిమానుల మనసునిపిండేశాయి. ఇక ఈ ఈవెంట్‌ని టీవీల్లో వీక్షిస్తున్న ప్రేక్షకులు కూడా అన్నదమ్ముల కన్నీళ్ళకి కరిగిపోయి కన్నీళ్లు పెట్టుకున్నారు.

Kalyan Ram Got Emotional at Aravinda Sametha pre Release Event:

Kalyan Ram speech at Aravinda Sametha Pre Release Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs