గీత్ ఆనంద్, చాందినీ భగ్వానాని హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రథం'.. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ పమ్మి సంగీతం అందిస్తుండగా, రాజగురు ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎ.వినోద్ సమర్పణలో రాజా దారపునేని నిర్మిస్తున్నాడు. ఇటీవలే ప్రముఖుల సమక్షంలో ఈ చిత్ర టీజర్ ను, ఒక పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. ఈ టీజర్ కి, పాటకి మంచి రెస్పాన్స్ రాగా మూవీపై భారీ అంచనాలను పెంచింది.
ఫ్రెష్ సినిమాగా కితాబందుకున్న ఈ సినిమాలోని మరో పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తాజాగా రిలీజ్ చేశారు.. 'బిల్ గేట్స్' అంటూ మొదలయ్యే ఈ పాట మాస్ ని బాగా అలరిస్తుంది.. ఇప్పటికే టీజర్, పాటతో అంతటా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకోగా ఈ పాటతో సినిమా ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది.. త్వరలోనే సినిమా ట్రైలర్, రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర నిర్మాతలు..